Daaku Maharaaj: డాకు మహారాజ్.. బాలీవుడ్ లో హిట్టా ఫట్టా?

సంక్రాంతి సందర్బంగా విడుదలైన నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రం తెలుగులో మాస్ ఆడియన్స్‌కి పక్కాగా కనెక్ట్ అయ్యింది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా, బాలయ్య కెరీర్‌లో మంచి వసూళ్లను రాబట్టి, అభిమానులను సంతోషపరిచింది. డాకు మహారాజ్ బాలయ్య వరుస హిట్లలో మరో పెద్ద అద్దంగా నిలిచింది. అయితే ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తూ, నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని భావించారు.

కథ నార్త్ ఇండియన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండటంతో, హిందీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో అడుగుపెట్టారు. కానీ హిందీ బెల్ట్‌లో మాత్రం ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. విడుదలైన మొదటి రెండు రోజుల్లోనే కేవలం 10 లక్షల వసూళ్లతోనే సరిపెట్టుకోవడం గమనార్హం. పుష్ప-2 లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం హిందీ మార్కెట్‌లో అద్భుత విజయాన్ని సాధించడంతో, ఆ సినిమా క్రేజ్ నుంచి డాకు మహారాజ్‌కు కూడా మేలు జరుగుతుందని భావించారు.

కానీ హిందీ ప్రేక్షకులు డాకు మహారాజ్‌ను పట్టించుకోలేదు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ఊర్వశీ రౌతేలా లాంటి స్టార్‌లను కలుపుకున్నప్పటికీ, నార్త్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించలేకపోయారు. తెలుగులో మాత్రం ఈ సినిమా 150 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి. అయితే హిందీలో ఇది ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో, రాబోయే అఖండ 2 సినిమాపై బయ్యర్ల ఆసక్తి ఎంతవరకు ఉంటుందో చూడాలి. మైథలాజికల్ జోనర్‌లో బోయపాటి తీసుకురాబోయే అఖండ 2 మాత్రం, ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

ఇంటికెళ్లి తాళి కట్టాను || Actor VV Rajkumar About His Marriage || Ramanaidu || Telugu Rajyam