Pawan Kalyan: పవన్ ఖాళీగా ఉంటే చేసే పని అదే… డిప్యూటీ సీఎంపై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి యాంకర్ అనసూయ తాజాగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ కూడా ఈయన ఎన్నికలకు ముందు కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి అయితే ఆయనకు కాస్త సమయం దొరికిన ప్రతిసారి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ ఆ సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా యాంకర్ అనసూయ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం గురించి ఈమె మాట్లాడారు తనకు అత్తారింటికి దారేది సినిమాలోని ఒక పబ్ సాంగ్ లో పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చింది కానీ ఆ పాటలో నటిస్తే నాకు ఎలాంటి గుర్తింపు రాదన్న ఉద్దేశంతోనే నేను రిజెక్ట్ చేశాను కానీ ప్రస్తుతం హర హర వీరు మల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి ఓ పాటలో కనిపించబోతున్నానని తెలియజేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి కూడా ఈమె ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్లో పాల్గొన్నప్పుడు షూటింగ్ సమయంలో ఏ మాత్రం విరామం దొరికిన ఆయన బుక్స్ చదువుతూనే కనిపిస్తుంటారు. లేదంటే పార్టీ మీటింగులు, పార్టీ గురించే హడావిడి చేస్తూ ఉండేవారని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారిలో ఒక చిన్న పిల్లల మనస్తత్వం కనబడుతుందని అనసూయ వెల్లడించారు. అసలు ఆయన ఒక వైపు సినిమాలను మరోవైపు రాజకీయాలను ఎలా బ్యాలెన్స్ చేస్తారని నాకు చాలా ఆశ్చర్యం వేస్తది అంటూ పవన్ గురించి అనసూయ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.