బాలీవుడ్ బడా నిర్మాత విడాకులు..భార్య షాకింగ్ డిమాండ్.!

ఇండియన్ సినిమా దగ్గర అతి పెద్ద సినిమా మార్కెట్ ఏదన్నా ఉంది అంటే అది బాలీవుడ్ మార్కెట్ అనే చెప్పాలి. వసూళ్ల పరంగా జనాభా పరంగా హిందీ మార్కెట్ పెద్దది గనుకే పాన్ ఇండియా లెవెల్ సినిమాలు భారీ వసూళ్లు రాబడుతున్నాయి. మన తెలుగు సినిమాలు కూడా వేల కోట్లు అందుకుంటున్నాయి అంటే దానికి కారణం కూడా హిందీ జనమే మరి.

అయితే బాలీవుడ్ ఇదే మార్కెట్ తో ఎదిగిన అనేక భారీ ప్రొడక్షన్ కంపెనీ లు మరియు బడా నిర్మాతలు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు అలాంటి ఓ పేరు మోసిన ప్రముఖ నిర్మాతే ఇపుడు తన భార్య నుంచి అయితే విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నాడట.

అయితే ఈ నిర్మాతకి తన భార్య షాకింగ్ మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆమె కూడా అతని నుంచి వేరు అవ్వడానికి సిద్ధం అయ్యింది కానీ భరణం కింద ఏకంగా 600 కోట్లు డిమాండ్ చేస్తుందట. దీనితో ఈ షాకింగ్ న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ వర్గాలలో వైరల్ గా మారింది. కాగా ఈ నిర్మాత ఎవరు ఆ భార్య ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కాగా బాలీవుడ్ లో ప్రముఖులు విడాకులు తీసుకుంటే ఈ రేంజ్ లోనే ఉంటుంది మరి.. గతంలో స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా తన భార్య నుంచి విడిపోయేటప్పుడు 500 కోట్ల మేర సెటిల్మెంట్ చేసినట్టుగా టాక్ ఉంది. ప్రస్తుతం అయితే ఆ బడా నిర్మాత లాయర్లు బేరసారాల్లో ఉన్నారని తెలుస్తుంది.