Pawan Kalyan: తెలుగు ప్రేక్షకులకు మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఆయన చాలా సినిమాల్లో సహాయ పాత్రలో నటించి నటనలో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా కొన్ని సినిమాల్లో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులను వేరే స్థాయిలో ఆకట్టుకున్నాడు.ఇక నాగబాబు నటనలోనే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలకు బాధ్యత చేపట్టాడు. మొత్తానికి నాగబాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఓ వెలుగు వెలుగుతున్నాడు.
ఇదిలాఉంటే నాగబాబు పవన్ కళ్యాణ్ కు ఏపీ ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఘర్షణ పై ఒక వీడియో ద్వారా స్పందించారు.ఆ వీడియోలో నాగబాబు మాట్లాడుతూ.. వకీల్ సాబ్ సినిమా నుంచి ప్రభుత్వం ఈరోజు భీమ్లా నాయక్ వరకు సినీ ఇండస్ట్రీ ను, పవన్ కళ్యాణ్ ను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసింది. ప్రభుత్వం పగతో పవన్ కళ్యాణ్ పై ఇలా చేస్తున్నప్పటికీ సినీ పరిశ్రమలో పెద్దలు సపోర్ట్ చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది.
అంతే కాకుండా ఇలా చేయడం తప్పు అని చెప్పడం కానీ, ఇక ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేయడం కానీ చేసిన వారు ఎవరూ లేరు. సినీ ఇండస్ట్రీ భద్రతను పవన్ కళ్యాణ్, ఆయనతో ఉన్న నాలాంటి వాళ్ళు అర్థం చేసుకోగలం మరి పెద్ద హీరోల పరిస్థితి ఎలా ఉంటే? ఇక సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి అని నాగబాబు ఆ వీడియోలో ప్రశ్నించాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు. మీరూ ఆ వీడియో పై ఓ లక్కెయండి. ఇక నాగబాబు రాజకీయ జీవితం విషయానికొస్తే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ లో చేరాడు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా పోటీ చేశాడు.