మరో బిగ్ షాక్..టాలీవుడ్ ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ మృతి.!

టాలీవుడ్ సినిమాల్లో కాదు కానీ కొంచెం వెనక్కి వెళితే తమిళ్ డబ్బింగ్ చిత్రాలు అలాగే పలు హాలీవుడ్ సినిమాల్లో మెయిన్ గా హీరో లకి సరైన వాయిస్ అంటే ఇది ఇంత పవర్ ఫుల్ గా ఉండాలి అని అనిపించే గొంతు అతనిది. అపరిచితుడు లో విక్రమ్ లో పలు వేరియేషన్స్ లో తెలుగు డబ్బింగ్ చెప్పినా తానే.

అలాగే స్టార్ హీరో సూర్య కి యముడు, దేవా, 24 మరెన్నో సినిమాల్లో తన డైలాగ్స్ తెలుగు ఆడియెన్స్ కి ఓ రేంజ్ లో ఎక్కాయి. మరి అలాంటి గొంతు వెనుక ఉన్న ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ నే శ్రీనివాస మూర్తి. దాదాపు 1988 లో సినిమా రంగంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేసిన తాను ఇప్పటికి వెయ్యికి పైగా సినిమాలకి డబ్బింగ్ చెప్పారు.

ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా తాను చెప్పారు. హీరోలు పలు కీలక పాత్రలు డబ్బింగ్ అయితే ఇక డబ్బింగ్ రంగంలో ఈయన తర్వాతే ఎవరైనా. మరి అలాంటి ప్రముఖ ఆర్టిస్ట్ ఇప్పుడు లేరు అనే వార్త షాకింగ్ గా మారింది. పైగా ఈరోజు ఉదయమే సీనియర్ నటి జమున గారి వార్త ఓ షాక్ కాగా ఇది మరో షాకింగ్ గా మారింది.

అయితే వీరి అకాల మరణంతో కూడా టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈయన ఈరోజు చెన్నై లో సడెన్ హార్ట్ స్ట్రోక్ రావడంతో మరణించినట్టుగా తెలిసింది. ఇలా ఆకస్మికంగా వారు చనిపోవడం బాధాకరం అలాగే ఇలా ఒకేరోజు రెండు విషాద వార్తలు రావడం కూడా టాలీవుడ్ దురదృష్టకరం.