ఇండియన్ సినిమాలో మరో తీవ్ర విషాదం.!

టాలీవుడ్ అలాగే ఇండియన్ సినిమాకి ఇప్పుడు ఏమైందో కానీ అనుకోని రీతిలో ఒకదాని తర్వాత ఒక షాకింగ్ వార్త వినాల్సి వస్తుంది. తెలుగు సినిమా సహా తమిళ్ సినిమాకి చెందిన ప్రముఖులు ముఖ్యంగా సీనియర్ దర్శకులు నటులే అది కూడా భారతీయ సినిమా దగ్గర తమదైన ముద్ర వేసిన వారే ఒకరి తర్వాత ఒకరు కన్ను మూయడం అనేది షాకింగ్ గా మారుతుంది.

మొన్ననే లెజెండరీ దర్శకులు కే విశ్వనాధ్ కన్నుమూశారు. ఇప్పుడు ఈరోజు ఏమో ప్రముఖ లెజెండరీ ప్లే బ్యాక్ సింగర్ అయినటువంటి వాణి జైరాం కన్నుమూసినట్టుగా వార్తలు ఇప్పుడు బయటకి వచ్చాయి. అయితే ఈరోజు చెన్నై లో వాణి జైరాం వయసు సంబంధించిన సమస్యలతో ఈరోజు వారి ఇంట్లోనే కన్ను మూశారట. 78 ఏళ్ల తాను దాదాపుగా 5 దశాబ్దాల పాటుగా ఇండియన్ సినిమా దగ్గర ఏకంగా 19 భాషల్లో పాటలు పాడి అలరించారు.

వాణి జైరాం 1945 తమిళనాడు లో జన్మించగా వారి కుటుంబమే సంగీత కళకి చెందింది కాబట్టి ఆమెకి కూడా గానం పై మక్కువ ఎక్కువయింది అలా 1971 లో ప్లే బ్యాక్ సింగర్ గా కెరీర్ ని ఆరంభించారు.అంతే కాకుండా మొత్తం 10 వేలకి పైగా పాటలు పాడగా వారి కృషికి గాను పద్మశ్రీ అవార్డు కూడా రీసెంట్ గానే కేంద్ర ప్రభుత్వం ఆమెకి ప్రకటించింది.

కాగా ఆమెకు మూడు జాతీయ పురస్కారాలు కూడా వచ్చాయి. దీనితో వీరి వార్త సినీ వర్గాల్లో ఒక్కసారిగా మరోసారి కలవర పెట్టగా ఈ వార్త విన్న సినీ ప్రముఖులు తమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు.