మనలో చాలామంది శరీరంపై బల్లి పడటం వల్ల ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పడి ఉంటారు. శరీరంపై బల్లి పడితే ఏదో ఒక చెడు ఘటనకు ఇది సంకేతం అని చాలామంది భావిస్తారు. ఇంట్లో గోడలపై ఉండే బల్లి కీలకాలను ఆహారంగా తీసుకుంటుంది. అయితే బల్లి శకునాల గురించి మనలో చాలామంది నమ్ముతారనే సంగతి తెలిసిందే. బల్లి పడితే కొన్నిసార్లు మరణం సంభవిస్తుందని నిపుణులు చెబుతారు.
బల్లి చేసే శబ్దం కూడా కొన్ని సంకేతాలకు కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి. శరీరంలో ఏ భాగంపై బల్లి పడినా వెంటనే వెంటనే తల స్నానం చేస్తే మంచిది. తెలియకుండా బల్లిని తాకినా కూడా మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. బల్లి భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ముందుగానే ఊహిస్తుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. బల్లి కింది నుంచి పైకి పాకితే మంచిది కాగా రివర్స్ లో జరిగితే మాత్రం మంచిది కాదు.
తల స్నానం చేసిన తర్వాత ఇష్ట దైవానికి నైవేద్యం పెట్టి ప్రార్థనలు చేయాలి. జడపై బల్లి పడితే మృత్యు భయం, వెనుక జుట్టుపై పడితే కూడా మరణం, జుట్టుపైన పడితే కష్టాలు కలుగుతాయి. తలపై పడితే కలహం, బ్రహ్మరంధ్రంపై పడితే కలహం కలిగే అవకాశం ఉంటుంది. ముక్కుపై బల్లి పడితే ఆరోగ్య సమస్యలు కలుగుతాయని చెప్పవచ్చు. ఎడమ చెవి మీద బల్లి పడితే వర్తక లాభం కలిగే ఛాన్స్ ఉంటుంది.
ముఖంపై బల్లి పడితే బంధు దర్శనం కలిగే అవకాశం ఉండగా కను బొమ్మలపై బల్లి పడితే కలహం ఏర్పడుతుందని, ఎడమ కన్ను మీద పడితే అవమానం, కుడి చెవి మీద చెడు వార్త వినడం జరుగుతుంది. బల్లి శకునాలకు సంబంధించి ఈ విషయాల గురించి అవగాహన కలిగి ఉంటే మంచిది.