మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో ముఖంపై మొంగు మచ్చల వల్ల ఇబ్బందులు పడి ఉంటారు. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ముఖంపై మొంగు మచ్చలకు సులభంగా చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ మచ్చల వల్ల ముఖం అంద విహీనంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. తొలి దశలోనే ఈ మచ్చలను గుర్తిస్తే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా చెక్ పెట్టవచ్చు.
కొన్నిసార్లు హార్మోన్ల సమస్యల వల్ల కూడా మొంగు మచ్చలు వచ్చే అవకాశాలు అయితె ఉంటాయి. మంగు మచ్చలపై వెన్నను రాయడం ద్వారా ఈ మచ్చలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. పచ్చి పసుపు, ఎర్రచందనం సమానంగా పాలలో కలిపి రాస్తే నల్లని మచ్చలు సులువుగా తగ్గే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. జాజికాయను పాలలో అరగదీసి రాయడం వల్ల కూడా మంగు మచ్చలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.
నేతిలో ఎర్ర కందిపప్పును నూరి మంగు మచ్చలపై రాస్తే నల్లదనం తగ్గుతుంది. టొమాటోను ముక్కలుగా చేసి మచ్చలపై బాగా రుద్ది శుభ్రం చేస్తే కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. అలోవేరా పేస్టును మచ్చలపై పూసి మచ్చతడి ఆరిపోయిన తర్వాత శుభ్రంగా కడిగితే మచ్చలు తగ్గిపోతాయి. రోజ్ వాటర్, కీరా రసం, నిమ్మరసం తేనె కలిపి మచ్చలపై రాసినా ఈ సమస్య దూరమవుతుంది..
ముఖంపై మంగు మచ్చలు ఏర్పడితే ఆత్మనూన్యతకు గురి కాకుండా ఈ చిట్కాలను పాటిస్తే మంచిది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మంగు మచ్చల సమస్య దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సమస్యతో బాధపడే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.