Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన చివరిగా కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ప్రస్తుతం కల్కి సీక్వెల్ సినిమాతో పాటు సలార్ 2, స్పిరిట్, రాజా సాబ్, ఫౌజి వంటి సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అనుకున్న ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు వందల కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇక ప్రభాస్ అందరితో ఎంతో సరదాగా గడుపుతూ ఉంటారు. అయితే ప్రభాస్ కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోలో భాగంగా ఈయన కాస్త ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ తన జీవితంలో ఒకే ఒక్కసారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంటూ మాట్లాడారు.ఈశ్వర్ పూజా కార్యక్రమం అప్పుడు నేను ఓ డైలాగ్ చెప్పా.. “ఆ ఈశ్వరుడికి మూడు కళ్లు.. ఈ ఈశ్వర్ కు మూడు గుండెలు” అని డైలాగ్ చెప్పా.. అది ఎలా చెప్పానో నాకు తెలియదు కానీ టెన్షన్ లో డైలాగ్ మొత్తం చెప్పేసాను. డైలాగ్ చెప్పిన తర్వాత మా నాన్న నా చెయ్యి పట్టుకొని యస్ అన్నారు. ఆ క్షణం నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంటూ ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక ప్రభాస్ తండ్రి ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగిన విషయం తెలిసిందే ఇక కృష్ణంరాజు వారసుడిగా ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.