Allu Arjun: పవన్ ఇంటికి సతీసమేతంగా అల్లు అర్జున్… సంతోషంలో అభిమానులు!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మధ్య గత కొంతకాలంగా భేదాభిప్రాయాలు ఉన్న విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ బన్నీకి ఏ మాత్రం సపోర్ట్ చేయకపోవడంతో వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని అందరూ భావించారు. ఇక అల్లు అర్జున్ బయటకు వచ్చినప్పుడు చిరంజీవి నాగబాబు ఇంటికి వెళ్లారే తప్ప పవన్ కళ్యాణ్ ని మాత్రం కలవలేదు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య విభేదాలు కొనసాగుతున్న సమయంలో వీరి అభిమానుల మధ్య కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతూనే ఉందని చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ సతీసమేతంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి చిన్నారి క్షేమంగా బయటపడ్డారు అయితే కొద్దిరోజులు విశ్రాంతి అవసరం కావడంతో పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే.

ఇలా చిన్నారి మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడటంతో తనని చూసి పరామర్శించడం కోసమే అల్లు అర్జున్ దంపతులు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారని తెలుస్తోంది. ఇలా పవన్ ఇంటికి వెళ్లిన ఈ దంపతులు దాదాపు గంటకు పైగా అక్కడే ఉండి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో మాట్లాడటమే కాకుండా చిన్నారి యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నారనీ తెలుస్తోంది. ఇలా చాలా రోజుల తరువాత వివాదాలన్నింటినీ కూడా పక్కన పెట్టి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడంతో మెగా అల్లు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.