AP: జగన్ హత్యకు ఏబీ వెంకటేశ్వరరావు కుట్ర…. శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

AP: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై హత్యకు కుట్ర చేస్తున్నారు అంటూ రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై వైజాగ్ ఎయిర్ పోర్టులో కోడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి మాజీ డిజిపి ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.

శ్రీనివాస వెంకటేశ్వరరావుని కలిసి ఆయనకు పూలమాలలు వేసి శాలువా కప్పి సన్మానం చేశారు. ఇలా వెంకటేశ్వరరావుతో కోడి కత్తి శీను భేటీ కావడంతో మరోసారి జగన్ పై కుట్రకు పథకం రచిస్తున్నారు అంటూ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. పక్కా పథకంతోనే జగన్మోహన్ రెడ్డి పై కుట్రకు ప్రణాళికలు రచిస్తున్నారని తెలియజేశారు.

మాజీ డీజీ,మాజీ ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు ఇంటికి జగన్ పై దాడి చేసిన వ్యక్తి వెళ్లడం దేనికి సంకేతం..ఇది సమంజసమా? అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డిని అంతమొందించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో జగన్ హత్య మిస్ అయిందని ఈసారి మాత్రం మిస్ కాకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు.

జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో భద్రతను చూస్తే స్పష్టంగా అర్థమవుతోందని..NIA చార్జిషీట్‌లో క్లియర్‌గా అటాక్ అని, ప్రీ మర్డర్ ప్లాన్ చేశారని జాతీయ దర్యాప్తు సంస్థ తేల్చిందని చెప్పారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్లను వెంకటేశ్వర్ రావు ట్యాప్ చేశారని, వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా జైలుకు వెళ్లిన నిందితులు ప్రస్తుతం బెయిల్ మీద బయట తిరగడం దేనికి నిదర్శనం అంటూ శ్రీకాంత్ రెడ్డి పలు సందేహాలను వ్యక్తం చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.