Team India: ఐపీఎల్ తరువాత బిజీబిజీగా టీమిండియా

టీమిండియా ఈ ఏడాది బిజీ షెడ్యూల్‌కి సిద్ధమవుతోంది. ఇప్పుడే ఐపీఎల్‌ హీట్ కొనసాగుతుంటే, జూన్ నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లు మళ్లీ మొదలవుతాయి. మొదటగా జూన్ 20 నుంచి జులై 4 వరకు ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత నేరుగా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది.

భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఆగస్టు 17 నుంచి 31 వరకు బంగ్లాదేశ్ పర్యటన జరగనుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. వన్డే సిరీస్‌లో మొదటి రెండు మ్యాచులు మిర్పూర్ వేదికగా జరగనున్నాయి. ఆగస్టు 17న తొలి వన్డే, ఆగస్టు 20న రెండో వన్డేలు జరుగుతాయి. ఆపై మూడో వన్డే ఆగస్టు 23న చట్టోగ్రామ్‌లో జరగనుంది.

అనంతరం టీమిండియా మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. మొదటి టీ20 ఆగస్టు 26న చట్టోగ్రామ్ వేదికగా జరుగుతుంది. రెండో, మూడో టీ20లు ఆగస్టు 29, 31 తేదీల్లో మిర్పూర్ వేదికగా జరుగనున్నాయి. ఈ పర్యటనలో టీమిండియా కాంబినేషన్ ఎలా ఉంటుందన్నదానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. టీ20ల్లో యువ ఆటగాళ్లకు అవకాశం దక్కే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక టెస్టుల తర్వాత వన్డే, టీ20లకు మారే ఈ మార్పు టీమిండియా జట్టుకు శక్తిని పరీక్షించేలా ఉంటుంది.

పలుకవేమి పవనానంద | Senior Journalist Bharadwaj Raects On Tirumala Cows Incident | Pawan Kalyan || TR