Pawan Kalyan: క్యాబినెట్ మీటింగ్ కు డుమ్మా కొట్టిన పవన్ కళ్యాణ్….. ప్రతిసారి ఎందుకిలా?

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా క్యాబినెట్ మీటింగ్ కు దూరంగా ఉన్నారు. ఇటీవల సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఈయన హైదరాబాద్లోనే ఉంటున్నారు అయితే నేడు ఉదయం 10 గంటలకు క్యాబినెట్ మీటింగ్ కోసం హైదరాబాద్ నుంచి సచివాలయానికి వచ్చారు. అయితే అనారోగ్య సమస్య కారణంగా ఈయన క్యాబినెట్ మీటింగ్ కు హాజరు కాకుండా వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.

ఇలా పవన్ కళ్యాణ్ లేకుండానే క్యాబినెట్ మీటింగ్ కూడా పూర్తి అయింది అయితే పవన్ కళ్యాణ్ ఇలా క్యాబినెట్ మీటింగ్ కు దూరంగా ఉండటం పట్ల పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ కేవలం డిప్యూటీ సీఎం మాత్రమే కాకుండా ఆరు శాఖలకు మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నారు ఇలాంటి సమయంలో ఈయన కేబినెట్ మీటింగ్ కు హాజరు కాకపోవడం ఏంటి అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణంగా క్యాబినెట్ మీటింగ్ కి దూరంగా ఉన్నారని తెలుస్తుంది. అయితే ఈయన గతంలో ఫిబ్రవరిలో నిర్వహించిన ఒక క్యాబినెట్ మీటింగ్ కి కూడా అనారోగ్య సమస్యల కారణంగా హాజరు కాలేకపోయారు అంటూ తెలియజేశారు. ఇలా ప్రతిసారి పవన్ కళ్యాణ్ కి హ్యాపీనెస్ మీటింగ్ కి దూరంగా ఉండటం పట్ల ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి.

ఇలా ప్రతిసారి క్యాబినెట్ మీటింగ్ సమావేశంలోనే పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురి అవుతున్నారని అలాగే ఈయన కలెక్టర్ల సమావేశానికి కూడా హాజరు కాకపోవడంతో పవన్ కళ్యాణ్ కు రాజకీయాలపై ఆసక్తి తగ్గిందా అందుకే ఇలా క్యాబినెట్ మీటింగ్ సభలు సమావేశాలకు హాజరు కాలేకపోతున్నారా అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు ఉన్నంత యాక్టివ్గా ఇప్పుడైతే లేరని తెలుస్తుంది.