AP: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. నిత్యం అధికార ప్రభుత్వంపై ప్రతిపక్ష ప్రతిపక్షంపై అధికార ప్రభుత్వం విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇక ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై పెద్ద ఎత్తున కేసులు పెడుతూ అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే త్వరలోనే వైకాపాకు చెందిన పెద్ద నేత అరెస్ట్ కాబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
మరి తర్వాత అరెస్టు కాబోయే వ్యక్తి ఎవరు అంటే అది అధినేత జగన్ అని తెలుస్తోంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు ఏపీ సర్కార్ అన్ని పథకాలు రచించినట్టు సమాచారం. ఏ క్షణమైనా తనని అరెస్టు చేయొచ్చనే వాదన వెలుగులోకి వచ్చింది. ఇందుకు తోడు వైసిపి మాజీ మంత్రి పేర్ని నాని సైతం ఇటీవల మీడియా సమావేశంలో భాగంగా జగన్ అరెస్టు గురించి మాట్లాడిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
పేర్ని నాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అంటూ మాట్లాడారు. ఏదో ఒక కేసులో తనని అరెస్టు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ నాని మాట్లాడటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే జగన్మోహన్ రెడ్డి హయామంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కాం జరిగింది అంటూ పార్లమెంటులో మాట్లాడిన విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ పెద్దదని పెద్ద ఎత్తున ఈ స్కాంలో అవినీతి జరిగిందనీ తెలుస్తుంది. ఇక ఈ విషయంలోజగన్ ను అరెస్ట్ చేయబోతున్నారు అంటూ వార్తలు వినబడుతున్నాయి.ఈ అంశంపై ఇంకా క్లారిటీ రావల్సి ఉంది. ఇప్పటికిప్పుడు జగన్‌ను అరెస్ట్ చేస్తే టీడీపీకి వచ్చే ప్రయోజనం ఏమిటి..? అన్న ధోరణిలోనే సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం.