ముఖం పై నల్లని మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా ఈ సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టండి!

అందంగా కనిపించాలని ఎవరు అనుకోరు చెప్పండి ప్రతి ఒక్కరు అందంగా కనిపించాలని ఉద్దేశంతో వేలకు వేలు డబ్బులు ఖర్చు చేసి అందం కోసం ఎన్నో రకాల మార్కెట్లో దొరికే ప్రోడక్ట్లను తెచ్చుకొని అందాన్ని పెంచుకోవడం కోసం కష్టపడుతుంటారు.అయితే చాలామంది ప్రతి రోజు బయట తిరగటం వల్ల ముఖంపై చేతులపై టాన్ ఏర్పడి మొహం మొత్తం నల్లగా మారుతూ అక్కడక్కడ నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి. అయితే ఈ నల్లటి మచ్చలు తొలగిపోవాలంటే కేవలం టమోటాతో ఈ చిట్కాలను పాటిస్తే చాలు. మరి టమోటాతో ఏం చేయాలి అనే విషయానికి వస్తే…

 

మొహంపై ఫ్యాన్ ఉన్నవాళ్లు ఒక పండిన టమోటా ను మధ్యలోకి కట్ చేసి దానిని చక్కెరలోకి అద్ది కాస్త పెరుగు వేసుకొని బాగా ముఖంపై మర్దన చేయడం వల్ల ముఖంపై ఏర్పడిన టాన్ తొలగిపోవడమే కాకుండా మృత కణాలు కూడా తొలగిపోయి ఎంతో అందంగా కాంతివంతంగా కనపడతారు. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మరొక టేబుల్ స్పూన్ టమోటా రసంలోకి టేబుల్ స్పూన్ ముల్తానా మట్టి కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం ఎంతో కాంతివంతంగా కనబడుతుంది.

 

ఒక టమోటా రసం, ఒక నిమ్మరసం మొత్తం పిండి ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి మిశ్రమంలో తయారు చేయాలి అయితే ఈ మిశ్రమం కాస్త పలుచగా ఉంటే ఇందులో సెనగపిండి వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ విషమాన్ని ముఖం మెడపై చేతులకు కూడా ప్యాక్ వేసుకొని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా వారానికి రెండు సార్లు చేయటం వల్ల ముఖంపై ఉన్నటువంటి ట్యాన్ తొలగిపోయి ఎంతో అందంగా తయారవుతారు.