టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుమారుడు అహాన్ శర్మ ఫేస్ తొలిసారిగా బహిరంగంగా బయటకు వచ్చింది. సోమవారం రోహిత్ భార్య రితిక కుమారుడిని ఎత్తుకుని ముంబయి విమానాశ్రయంలో కనిపించారు. ఈ క్రమంలో అక్కడున్న ఫొటోగ్రాఫర్లు వారి ఫోటోలు, వీడియోలు తీశారు. ఆ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో చిన్నారి అహాన్ ఫేస్‌కు నెటిజన్ల నుంచి ప్రేమ వెల్లువెత్తుతోంది.
వీడియోల్లో అహాన్ క్యూట్ లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ముద్దుగొలిపే బుగ్గలు, రౌండ్ ఫేస్, నిగనిగలాడే కళ్ళతో అచ్చం తన తండ్రి రోహిత్ శర్మలాగే ఉన్నాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. “హిట్‌మాన్ మినీ వర్షన్”, “క్యూటెస్ట్ బేబీ అహాన్” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో హిట్‌మాన్ ఫ్యామిలీ ఫొటోలు ఒక్కసారిగా ట్రెండ్ అవుతున్నాయి.
He’s so cute. May God protect him from all evil eyes. pic.twitter.com/9NeBTA2rF2
— 𝐉𝐨𝐝 𝐈𝐧𝐬𝐚𝐧𝐞 (@jod_insane) April 14, 2025
ఇదిలా ఉంటే… ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంబయి ఇండియన్స్ ఓడించింది. ఆ విజయం తర్వాత ముంబయి జట్టు తదుపరి మ్యాచ్‌కి సిద్ధమవుతోంది. ఈ గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వాంఖడే స్టేడియంలో ముంబయి తలపడనుంది. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
ఇప్పటి వరకు ముంబయి 6 మ్యాచ్‌లు ఆడి 2 విజయాలు సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మరోవైపు ఎస్ఆర్‌హెచ్ కూడా 6 మ్యాచుల్లో 2 విజయాలు సాధించింది. కానీ నెట్ రన్‌రేట్ (-1.245) తక్కువగా ఉండటంతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఒకే రేంజ్‌లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. దీంతో ఒకవైపు రోహిత్ చిన్నారి వైరల్ అవుతుండగా… మరోవైపు మైదానంలో హిట్‌మాన్ బ్యాటింగ్ ఎలాగుంటుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.