Kodali Nani: కొడాలి నాని హెల్త్ అప్డేట్… జగన్ కి పూర్తి సమాచారం… రాజకీయాలకు నాని దూరం!

Kodali Nani: వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నాని అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఈయన ఉన్నఫలంగా గుండె నొప్పితో బాధపడటంతో తనని హైదరాబాద్లోనే ఏఐజి ఆసుపత్రికి తరలించారు. అయితే గుండెకు పరీక్షలు నిర్వహించిన అనంతరం తనకు బైపాస్ సర్జరీ అవసరం అని డాక్టర్లు చెప్పడంతో వెంటనే కొడాలి నానిని ముంబై తరలించారు.

ఇలా ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో బైపాస్ సర్జరీ నిర్వహించారు. సర్జరీ తరువాత కొడాలి నాని క్రమేణా కోలుకుంటున్నారు. మాజీ సీఎం జగన్ వైద్యులతో మాట్లాడారని తెలుస్తుంది. ప్రస్తుతం నాని ఆరోగ్యం నిలకడగా ఉందని ఈయనని ఐసీయూ నుంచి సాధారణ రూమ్ కి షిఫ్ట్ చేశారని తెలుస్తోంది. ఇక నెమ్మదిగా కొడాలి నాని కోలుకుంటున్నట్టు సమాచారం.

ఇక నాని ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి వైద్యులతో మాట్లాడటం అలాగే నాని కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరుగుతుంది. ఇక జగన్ సూచనలు మేరకు మాజీ మంత్రి పేర్ని నాని ముంబై వెళ్తున్నట్టు సమాచారం. ఇక కొడాలి నాని ఈనెల 19వ తేదీ లేదా 20వ తేదీ డిశ్చార్జ్ కాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం హైదరాబాద్ చేరుకోబోతున్నారు.

తదుపరి వైద్య పరీక్షల కోసం నాని హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రికి వెళ్లబోతున్నారని తెలుస్తోంది. ఇక నాని ఆరోగ్యంగా ఉన్నప్పటికీ రాజకీయాలకు దూరంగా ఉండాలని జగన్ ఆదేశించినట్టు తెలుస్తుంది. కొద్ది రోజులపాటు రాజకీయాలకు సంబంధించిన ఏ విషయాల గురించి నాని మాట్లాడకూడదని పూర్తిగా ఆరోగ్యంగా కోలుకున్న తర్వాతనే రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనాలి అంటూ జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో నాని కొంతకాలం పాటు రాజకీయాలకు కూడా దూరం కానున్నరని తెలుస్తుంది.