Ntr: బక్కచిక్కిపోయిన ఎన్టీఆర్… అనారోగ్య సమస్యలే కారణమా… కంగారు పడుతున్న ఫ్యాన్స్!

Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ త్వరలోనే వార్ 2, సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిలిం స్టూడియోలో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇకపోతే ఇటీవల ఎన్టీఆర్ లుక్ కి సంబంధించి అభిమానులు ఎంతో కంగారు పడుతున్నారు. ఎన్టీఆర్ చాలా బక్క చిక్కిపోవడమే కాకుండా ఎన్టీఆర్ లుక్ కూడా పూర్తిగా మారిపోయింది దీంతో అభిమానులు అసలు ఎన్టీఆర్ కి ఏమైంది.. ఎందుకలా మారిపోయారు.. ఆయన ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారా అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఆరోగ్యపరంగా చాలా మంచిగా ఉన్నారు కానీ ఆయన డ్రాగన్ సినిమా కోసమే ఇలా మారిపోయారని తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలు సాధారణంగా కండలతో, బలమైన రూపంలో కనిపిస్తారనే అభిప్రాయం ఉన్నప్పటికీ, ఈ సినిమాలో మాత్రం ఎన్టీఆర్ చాలా విభిన్నమైనటువంటి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ కఠినమైన డైట్, వర్కవుట్ రొటీన్‌ను అనుసరించి, శరీర ఆకృతిని పూర్తిగా మార్చుకున్నారని అంటున్నారు. ఇక ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ చూసిన అభిమానులు ఒకవైపు ఆశ్చర్యపోతూనే, సినిమా పట్ల ఆయనకు ఉన్నటువంటి అంకిత భావం తెలిసి ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ కేవలం సినిమా కోసం మాత్రమే అలా సన్నబడ్డారు తప్ప ఆరోగ్యపరంగా ఆయన ఎలాంటి ఇబ్బందులు అయినా ఎదుర్కోలేదని ఎన్టీఆర్ చాలా ఆరోగ్యవంతంగా ఉన్నారని తెలుస్తోంది.