Harish Rao: బెట్టింగ్ యాప్‌ల వలన నా గన్ మ్యాన్ కుటుంబం చనిపోయింది: హరీష్ రావ్

ఇంటర్నెట్‌ లో అందుబాటులో ఉన్న బెట్టింగ్ యాప్‌లు ఇప్పుడు యువత జీవితాలను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆశతో ఎంతో మంది ఈ యాప్‌ల వలలో పడుతున్నారు. కానీ చివరికి అప్పుల ఊబిలో పడి కొందరు జీవితాన్నే కోల్పోతున్నారు. ఈ విషయంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ నేత హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

తన వద్ద గన్‌మ్యాన్‌గా పనిచేసిన వ్యక్తి ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌ల కారణంగా తీవ్ర నష్టం చవిచూశాడని హరీశ్ తెలిపారు. డబ్బు కోల్పోయి అప్పుల్లో కూరుకుపోయిన అతను దాన్ని తట్టుకోలేక, భార్యతో పాటు ఇద్దరు పిల్లలను గన్ తో కాల్చేసి, అతను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన తనను బాగా కలిచివేసిందని హరీశ్ భావోద్వేగంగా వెల్లడించారు.

హరీశ్ రావు మాట్లాడుతూ.. “ఒక్క షార్ట్‌కట్‌తో డబ్బు సంపాదిస్తామనుకోవడం తప్పుడు ఆలోచన. బెట్టింగ్ యాప్‌లు మనల్ని గెలిపించాలనే కాదు.. వాళ్లకు లాభం కావడమే లక్ష్యం. యువత ఈ వలలో చిక్కకూడదు. ఒక్కసారి పడిపోయారంటే దాన్నుంచి బయటపడటం చాలా కష్టం” అని స్పష్టం చేశారు.

తమ కుటుంబం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, యువత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఈ యాప్‌లు లైసెన్సుల్లేకుండా నడుస్తున్నట్లు, ప్రభుత్వం వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. “ఒకరి జీవితానికి మరొకరు బాధ్యులవద్దాం. ఒక్క క్లిక్‌తో జీవితాలను నాశనం చేసుకోకండి” అంటూ హరీశ్ రావు హెచ్చరించారు.

ఎవరికోసం షర్మిల రాజకీయం? || Facts Behind Ys Sharmila Politics || Ys Jagan || Chandrababu || TR