Kubera: శేఖర్ కమ్ముల ‘కుబేర’ ఫస్ట్ సింగిల్ డేట్ అనౌన్స్‌మెంట్

శేఖర్ కమ్ముల ‘కుబేర’ ఫస్ట్ సింగిల్ ఏప్రిల్ 20, 2025న విడుదల కానుంది. ఈరోజు డేట్ ని అనౌన్స్ చేశారు. పాట యొక్క మరిన్ని వివరాలతో ప్రోమోను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

శేఖర్ కమ్ముల ‘కుబేర’ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్, ఇది నేషనల్ అవార్డు గ్రహీత దర్శకుడు శేఖర్ కమ్ముల, నేషనల్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు డీఎస్పీ మొదటిసారి కలిసి చేస్తున్న చిత్రం! మరో ఎక్సయిటింగ్ విషయం ఏమిటంటే నేషనల్ అవార్డు గ్రహీత ధనుష్ ఫ్రేమ్‌లో ఉన్నారు! ఈ ముగ్గురూ కలిసి మాస్ డ్యాన్స్ నంబర్ ఇవ్వడం ఇదే మొదటిసారి.

విడుదల చేసిన పోస్టర్‌లో ధనుష్ డ్యాన్స్, విజల్స్ తో వేడుక వాతావరణం ఉంది. బ్యాక్ డ్రాప్ లో డ్యాన్స్ చేస్తూ పెద్ద సంఖ్యలో జనం పండుగ మూడ్‌లో కనిపించారు. ఈ పాట ఫుట్ ట్యాపింగ్ మ్యూజిక్‌తో కూడిన మాస్ సాంగ్ అని హామీ ఇచ్చింది.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం ‘కుబేర’. ధనుష్, నాగార్జున అక్కినేని, రష్మిక మందన్న, జిమ్ సర్భ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా నిలుస్తుంది.

శేఖర్ కమ్ముల ‘కుబేర’ ఎపిక్ సోషల్ డ్రామా రూపొందుతోంది. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి భారీ స్థాయిలో చిత్రీకరించబడుతోంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తారు.

అద్భుతమైన తారాగణం, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్, ఆసక్తికరమైన కథాంశంతో సంచలనం సృష్టించిబోతున్న శేఖర్ కమ్ముల ‘కుబేర’ జూన్ 20, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మల్లి సజ్జల | Ks Prasad Reacts On Sajjala Ramakrishna Reddy Elected As PAC Convenor | YS Jagan | TR