Mudragada: ముద్రగడ పద్మనాభం ఈ పేరు వింటేనే కాపు ఉద్యమ నేతగా ఈయన అందరికీ గుర్తుకు వస్తారు. కాపు వర్గానికి కూడా రిజర్వేషన్ కావాలి అంటూ ఈయన చేసిన పోరాటం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఈ పోరాటం ద్వారా ఈయన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. గతంలో మంత్రిగా పనిచేసినప్పటికీ కూడా ముద్రగడ అంటే కాపు ఉద్యమనేత అనే విధంగా పోరాటం చేశారు.
ఇలా కాపు సామాజిక వర్గం కోసం ఇంతలా పోరాటం చేసిన ఈయన క్షణికావేశంలో మాట్లాడిన మాటలు కారణంగా ఏకంగా తన పేరు పక్కనే రెడ్డి అని చేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.. 2024 ఎన్నికలలో ఈయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని, పవన్ గెలిస్తే తన పేరు పక్కన రెడ్డి అని పేరు పెట్టుకుంటాను అంటూ సవాల్ విసిరారు.
ఇక పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడం వల్ల ముద్రగడ పద్మనాభం సైతం అధికారకంగా తన పేరు మార్చుకొని పద్మనాభ రెడ్డిగా మారిపోయారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాశారు అయితే ఈ లేఖలో కూడా తన పేరు పక్కన రెడ్డి అని ఉండటం చూసిన కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పాలి.
ఇటీవల జగన్ ముద్రగడ పద్మనాభంను పొలిటికల్ అడ్వైజర్ కమిటీలో సభ్యునిగా చేర్చారు. ఇందుకు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈయన లెటర్ రాశారు. అయితే ఈ లేఖలో తన పేరును పద్మనాభరెడ్డిగా రాయడంతో కాపు సామాజిక వర్గీయులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన లెటర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.