బీటెక్ అభ్యర్థులకు అదిరిపోయే శుభవార్త ఇదే.. డిజిటల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. బీటెక్‌ అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండనే ఈ ఉద్యోగ ఖాళీలకు సులువుగా ఎంపికయ్యే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 60 ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ విడుదల కాగా ఈ ఉద్యోగ ఖాళీలలో 40 పోస్టులు డేటా అనలిస్ట్ ఉద్యోగ ఖాళీలు ఉండగా 20 పోస్టులు డేటా సైంటిస్ట్ కు సంబంధించినవి ఉన్నాయి.

కనీసం బీటెక్ చదివి మేనేజ్ మెంట్ అండ్ అనాలసిస్ లో అనుభవం ఉన్నవాళ్లు డేటా అనలిస్ట్ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. డేటా సైంటిస్ట్ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి కూడా దాదాపుగా ఇవే అర్హతలు ఉండాలి. డేటా మేనేజ్ మెంట్ యూనిట్ ప్రాజెక్ట్ కింద ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు ఢిల్లీలో పని చేయాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. 2023 సంవత్సరం జూన్ నెల 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు ఢిల్లీలో చేయాల్సి ఉంటుంది. https://dic.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు వేతనం కూడా భారీ రేంజ్ లో ఉండనుందని తెలుస్తోంది.