అన్నమయ్య జిల్లాలో 1294 ఆశా వర్కర్ ఉద్యోగ ఖాళీలు.. ఒకింత భారీ వేతనంతో?

అన్నమయ్య జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నిరుద్యోగ మహిళకు శుభవార్త చెప్పింది. అన్నమయ్య జిల్లాలో 1294 ఆశా వర్కర్ ఉద్యోగ ఖాళీల జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆశా వర్కర్ల నియామకానికి ప్రకటన వెలువడగా ఈ ప్రకటన వల్ల నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. అర్హత, ఆసక్తి ఉన్న మహిళలు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆఫ్ లైన్ ద్వారా మహిళలు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. జూన్ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సంబంధిత గ్రామానికి నివాసి అయిన మహిళలు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కనీసం పదో తరగతి పాసైన వాళ్ళు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెరుగైన నైపుణ్యాలతో పాటు ప్రజలతో కలిసిమెలిసి పని చేయగల సామర్థ్యం అవసరం అని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు అర్హులు అని చెప్పవచ్చు. నిబంధనల ప్రకారం కొన్ని కేటగిరీలకు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. అభ్యర్థి గ్రామంలో నివశిస్తున్నట్టు గ్రామ నివాస ధ్రువీకరణ పత్రం అవసరం అని చెప్పవచ్చు.

స్థానికంగా పని చేయగల సామర్థ్యం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు పేర్కొన్న ఫారంను పూర్తిగా పూరించి ధ్రువపత్రాల ప్రతులతో కలిపి సంబంధిత మెడికల్ ఆఫీసర్ కార్యాలయంలో స్వయంగా సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పాస్ ఫోటో, స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం, విద్యార్హతల పత్రాలు, ఆధార్ కార్డు, తల్లిదండ్రుల వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.