ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో టీచింగ్ అసోసియేట్ జాబ్.. భారీ వేతనంతో?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పులివెందులలో ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ యూనివర్సిటీలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్ అసోసియేట్ జాబ్ కు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. మే నెల 28వ తేదీన ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలు జరగనున్నాయి. టీచింగ్ అసోసియేట్ జాబ్ విషయానికి వస్తే డిగ్రీ, పీజీ, పీహెచ్డీతో పాటు నెట్ క్వాలిఫికేషన్, పని అనుభవం ఉండాలి.

45 సంవత్సరాల లోపు ఉన్న మహిళా అభ్యర్థులు, 40 సంవత్సరాల లోపు ఉన్న పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెలకు పీజీ హోల్డర్లకు 61,000 రూపాయల వేతనం లభించనుండగా పీహెచ్డీ హోల్డర్లకు నెలకు 67,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఈ నెల 28వ తేదీన ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలు జరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

పులివెందులలోని కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఒకింత పోటీ ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉందని సమాచారం ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఎంతగానో మేలు జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు.

ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఎక్కువ వేతనం లభిస్తుండటం వల్ల నిరుద్యోగులకు మేలు జరగనుంది. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదివిన వ్యక్తులు పరిమితంగా ఉంటాయి.