దేశంలోని ప్రధాన నగరాలలో ఒకటైన ముంబైలోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి సంబంధించిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థ టాటా మెమోరియల్ సెంటర్ అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ట్రీట్మెంట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ సైంటిఫిక్ అసిస్టెంత్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తోంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది.
సైంటిఫిక్ అసిస్టెంట్ విభాగంలో కేవలం ఒక ఉద్యోగ ఖాళీని మాత్రమే భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. లైఫ్ సైన్స్ విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వాళ్లకు 27,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.
అర్హత ఉన్నవాళ్లు జూన్ నెల 19వ తేదీన ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. నవీ ముంబైలోని పీఎస్ 306, మీటింగ్ రూమ్, 3వ అంతస్తు, పేమాష్టర్ షోధిక ఏసీటీ ఆర్ఈసీ, ఖార్ఖర్ ప్రాంతంలో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే సంస్థను సంప్రదించడం ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
అయితే ఇతర నగరాలతో పోల్చి చూస్తే ముంబైలో ఖర్చులు ఒకింత ఎక్కువ మొత్తంగా ఉంటాయి. వరుసగా వేర్వేరు ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉండటం గమనార్హం. ఒక ఉద్యోగ ఖాళీ మాత్రమే ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.