ఎల్ఐసి ప్రవేశపెట్టిన ఈ స్కీం ద్వారా ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) ఇప్పటికే ఎన్నో బీమా పథకాలను అమలులోకి తీసుకువచ్చి ప్రజలకు ఆర్థికంగా ఎంతో సహాయం చేస్తుంది. ఇక తాజగా ధన్ వర్ష పాలసీ కూడా ప్రవేశపెట్టింది. ఈ సరికొత్త పాలసీ ప్రజలకు ఎంతగానో ప్రయోజనకరంగ ఉంటుంది. పాలసీ దారులు ఈ పాలసీతో రక్షణతో పాటు పొదుపు కూడా పొందవచ్చు. ఈ పాలసీ టర్మ్ రెండు రకాలుగా ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లు ఎక్కువ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది.

ధన్ వర్ష్ పాలసీ అనేది క్లోజ్-ఎండెడ్ స్కీమ్. ఈ స్కీమ్ వల్ల ఎంతో బెనిఫిట్ పొందవచ్చు. ఈ స్కీమ్ సింగిల్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. కాగా ఈ స్కీమ్ నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిడ్యువల్ సేవింగ్స్ స్కీమ్ కూడా కావడం గమనార్హం. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు పాలసీ టర్మ్ పూర్తి కాకముందే మరణిస్తే నామినీ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. అలాగే పలసిదారులు ప్రమాదంలో అంగ వైకల్యం సంభవిస్తే పది సంవత్సరాల పాటు నెలసరి వాయిదాలలో చెల్లించాల్సిన మొత్తాన్ని పొందవచ్చు. మెడికల్ తో పాటు నాన్ మెడికల్ విభాగాల్లో ఈ పాలసీ అందుబాటులో ఉంది.

అయితే ఈ పాలసీ తీసుకోవటానికి పాలసీదారుల వయసు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. ఈ ధన్ వర్ష్ పాలసీలో కనీసం 1,25,000 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.
అయితే మనం తీసుకునే పాలసీ టర్మ్ ను బట్టి పొందే ప్రయోజనాల విషయంలో మార్పులు ఉంటాయి. ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకోవటానికి సమీపంలో ఉన్న ఎల్ఐసి ఏజెంట్ ను సంప్రదించడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేసిన పాలసీదారులకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి.