కరోనా సోకిన వాళ్లకు షాకింగ్ న్యూస్.. వాటిపై ఎఫెక్ట్ పడుతుందా?

కరోనా వైరస్ దేశంలోని చాలా కుటుంబాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ నుంచి కోలుకున్న వాళ్లను సైతం ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధించాయి. తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యులలో ఒకరైన సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సైడ్ ఎఫెక్ట్స్ హెల్విక్ హిప్ పై కూడా ఉంటాయని చెప్పారు. ఎముకలకు సంబంధించి ఈ సమస్య ఏర్పడుతోందని ఆయన తెలిపారు.

కరోనా సోకిన వాళ్లు ఈ విషయాలకు సంబంధించి అవగాహనను కలిగి ఉంటే మంచిది. కరోనా సోకిన వాళ్లకు ఆటో ఇమ్యూన్ రియాక్షన్ సమస్యలతో పాటు రియాక్టివ్ అర్థరైటిస్ కు కారణమవుతుంది. కరోనా సోకిన వాళ్లు తొడ ముందు భాగంలో లేదా మోకాలిలో నొప్పి వస్తే జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. కరోనా సోకి ఈ సైడ్ ఎఫెక్ట్ వచ్చిన వాళ్లు మెట్లు ఎక్కి నడవాలంటే కూడా ఎంతో ఇబ్బంది పడతారు.

కరోనా సోకిన వాళ్లు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కొన్నిసార్లు ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం అయితే ఉంది. కరోనా సోకిన వాళ్లు ఏడాదికి ఒకసారైనా హెల్త్ చెకప్ చేయించుకుంటే మంచిదని చెప్పవచ్చు. కరోనా వైరస్ ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

కరోనా తర్వాత గుండె సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. చిన్న వయస్సులోనే గుండె సంబంధిత సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.