ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది బీపీ సమస్యతో బాధ పడుతున్నారు. అయితే కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల బీపీ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఉప్పును డైరెక్ట్ గా తీసుకోకపోయినా కొన్ని ఆహారాలు ప్రాణాలకు హాని కలిగిస్తాయి. మనలో చాలామంది వేయించిన ఆహారాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే ఈ ఆహారాలు కూడా బీపీని పెంచే ఛాన్స్ అయితే ఉంటుంది.
బీపీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటే బీపీ అమాంతం పెరిగే అవకాశాలు ఉంటాయి. చిప్స్, నూడుల్స్, సాల్ట్ బిస్కెట్స్, స్నాక్స్, పాస్తా తినడం వాళ్ళ ఆరోగ్యానికి హాని కలిగే ఛాన్స్ ఉంటుంది. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి కొన్ని ప్రిజర్వేటివ్స్ ను వినియోగిస్తారు. ఈ ఆహారాలు దీర్ఘకాలంలో శరీరానికి హాని చేస్తాయని చెప్పవచ్చు.
ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో నష్టం కలుగుతుంది. నిల్వ పచ్చళ్ళు తినడం వాళ్ళ కూడా బీపీ పెరుగుతుంది. వీటి కోసం ఉప్పును ఎక్కువ మొత్తంలో వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. బీపీ వచ్చిన వాళ్ళు వీలైనంత వరకు వీటికి దూరంగా ఉంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో స్వీట్లు తినడం ద్వారా బీపీ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
బీపీ సమస్యతో బాధ పడేవాళ్ళు బేకరీ వస్తువులకు సైతం దూరంగా ఉంటే మంచిది. ఈ ఆహారాలు దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చేటు చేస్తాయి. కాఫీ, టీ, మరియు ఎనర్జీ డ్రింక్స్ బీపీని పెంచుతాయి. అధిక మొత్తంలో మద్యం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. రెడీ-టు-ఈట్ మీల్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, మరియు ఇతర ప్రాసెస్ చేసిన ఆహారాలు ఆరోగ్యానికి నష్టం కలిగిస్తాయి. అధిక రక్తపోటును నివారించడానికి, తక్కువ సోడియం, తక్కువ కొవ్వు, సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం అని చెప్పవచ్చు.