ఆలస్యంగా నిద్రపోవడం వలన అనేక నష్టాలు ఉన్నాయి, వీటిలో ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, మరియు సామాజిక సమస్యలు ఉంటాయి. నిద్రలేమి వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మరియు ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఏకాగ్రత తగ్గడానికి, జ్ఞాపకశక్తి తగ్గడానికి, మరియు భావోద్వేగ రుగ్మతలకు కూడా దారితీస్తుంది. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. ఆలస్యంగా నిద్రపోతే రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
లేట్ గా పడుకోవడం వల్ల చర్మం దెబ్బ తినడంతో పాటు వృద్ధాప్యం వేగంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆలస్యంగా నిద్రపోతే ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపకశక్తి తగ్గడం లాంటి సమాస్యలు వస్తాయి. భావోద్వేగ రుగ్మతలు మరియు నిస్పృహకు మానసిక సమస్యలు దారి తీస్తాయి. లేట్ గా నిద్రపోవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి.
రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోతే సరైన ఆహారపు అలవాట్లు ఉండవు. లేట్ గా నిద్రపోతే పనితీరు తగ్గడంతో పాటు బంధాలు దెబ్బతింటాయి. ఇతరులతో సరైన సంబంధాలు లేకపోతే నిరాశ, చిరాకు లేదా ఆందోళన కలుగుతాయి ఆలస్యంగా నిద్రపోవడం అంటే సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోవడం మన ఆరోగ్యానికి చాలా హానికరమని ఆయుర్వేద నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆలస్యంగా నిద్రపోవడం నిద్ర నాణ్యతను దెబ్బ తీస్తుంది. ఆలస్యంగా నిద్రపోవడానికి ఏవైనా కారణాలు ఉంటే ఆ అలవాట్లను మార్చుకునే దిశగా అడుగులు వేయాలి.