కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూరేలా ఇప్పటికే పలు స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా కోట్ల సంఖ్యలో రైతులు ఎన్నో బెనిఫిట్స్ ను పొందుతున్నారు. అయితే పంటలు పండించే రైతులు ఎరువులను ఎక్కువగా వినియోగించడం సాధారణంగా జరుగుతుంది. ఎరువుల ధరలు ఇప్పటికే ఎక్కువగా ఉండటంతో రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
అయితే ఎరువులపై సబ్సిడీ ఇచ్చే దిశగా కేంద్రం అడుగులు వేయడం గమనార్హం. రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా వెల్లడించిన విషయాలు రైతులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఫాస్ఫటిక్ అండ్ పొటాసిక్ ఎరువుల కోసం ఏకంగా 38,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండటం గమనార్హం. మిగతా ఎరువులపై కూడా కేంద్రం 70,000 కోట్ల రూపాయల సబ్సిడీ అందిస్తోంది.
రైతులు వ్యవసాయంలో ఎక్కువగా వినియోగించే యూరియా కోసం 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండటం గమనార్హం. మరోవైపు ఈ ఏడాదికి ఎరువుల ధరలను పెంచడం, తగ్గించడం చేయడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం డీఏపీ బస్తా 1350 రూపాయలు ఉండగా ప్రస్తుతం యూరియా బస్తా 276 రూపాయలుగా ఉంది. 1,08,000 రూపాయలను కేంద్రం ఇందుకోసం ఖర్చు చేస్తుండటం గమనార్హం.
దాదాపుగా 12 కోట్ల మంది రైతులు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్స్ పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను తగ్గిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎరువుల ఎంఆర్‌పీలో ఎలాంటి మార్పు ఉండదని కేంద్రం చేసిన ప్రకటన రైతులకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది.