వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈ వస్తువులను నాలుగు దిక్కులలో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం..?

house-vastu-tips-85

ప్రస్తుత కాలంలో మనిషి తన జీవన ప్రయాణాన్ని కొనసాగించడానికి డబ్బు ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఎంత కష్టపడి పనిచేసే డబ్బు సంపాదించిన కూడా ఏదో ఒక రూపంలో ఖర్చవుతూ ఉంటుంది. అందువల్ల నిత్యం ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అయితే ఆర్థిక సమస్యలు వెంటడానికి వాస్తు దోషం కూడా ఒక కారణం కావచ్చు. అయితే ఈ వాస్తు దోషాలను తొలగించడానికి అనేక పూజలు, పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు. అందువల్ల ఇంటిని నిర్మించేటప్పుడు వాస్తు నియమాలను అనుసరిస్తూ ఇంటిని నిర్మించాలి.

అలాగే ఇంట్లో సానుకూల శక్తి ఉండానుకుంటే ఉత్తరం దిక్కున 4 వస్తువులను పెడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.వాస్తు శాస్త్రం ప్రకారం . ఇంటి ప్రధాన ద్వారం సరైన దిశలో లేకుంటే అనేక రకాల సమస్యలు ఏర్పడుతాయి. అందువల్ల ఇంటి ప్రధాన ద్వారం ఉత్తర దిశలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే లక్ష్మి దేవి అనుగ్రహం నిరంతరాయంగా లభిస్తుంది. అలాగే మనం ఇంట్లో ఉంచే వల్ల కూడా దోషాలు కూడా ఏర్పడతాయి. వాస్తు శాస్త్ర నిపుణుల సూచనల ప్రకారం ఇంట్లోఉత్తరం వైపున ఉండాలి.

అలాగే ఇంట్లో మనీ ప్లాంట్ పెంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భావిస్తారు. కానీ మనీ ప్లాంట్ సరైన దిశలో ఉంచకపోవడం వల్ల అనే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఉత్తరం వైపు ఉంచాలి. అప్పుడే ఇంట్లో సంపదకు లోటు ఉండదు. ఇక ఇంట్లో వంటగది సరైన దిశలో ఉండటం కూడా చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఉత్తరం వైపున ఉండాలి. ఇలా వంటగది ఉత్తరం వైపున ఉంటే అన్నపూర్ణ దేవి ఎల్లప్పుడు ఇంట్లో కొలువై ఉంటుందని ప్రజల నమ్మకం.