ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే సంపద, సంతోషం కలుగుతాయట.. పాటించాల్సిన చిట్కాలు ఇవే!

మనలో చాలామందికి వాస్తు గురించి అంతోఇంతో అవగాహన ఉంటుంది. వాస్తు చిట్కాలు పాటించడం ద్వారా సంపద, సంతోషం కలగడంతో పాటు ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. వాస్తు నిబంధనల ప్రకారం ఇంట్లో నైరుతి దిశలో వార్డ్ రోబ్ ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో అక్వేరియం కలిగి ఉండటం వల్ల కూడా కుటుంబానికి మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

వేణువును ఇంట్లో ఉంచుకోవడం ద్వారా కూడా మంచి జరుగుతుంది. మంచం ముందు అద్దాలను ఉంచడం మానేస్తే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. దక్షిణం వైపు తల పెట్టి పడుకోవడం ద్వారా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. నిద్రపోయే భంగిమ విషయంలో సరైన వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలి. మంచం క్రింద చెత్త చెదారం, ఇనుప వస్తువులు లేకుండా చూసుకుంటే మంచిది.

బాత్ రూమ్ తలుపులను ఎప్పుడూ క్లోజ్ చేసే ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకుంటే మంచిది. ఎక్కడ ఏ వస్తువు ఉండాలో ఆ వస్తువులను అక్కడే ఉంచాలి. వాస్తు దోషాలకు పాల్పడితే ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. వాస్తు నియమాలను పాటించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఇంట్లో ప్రతికూల శక్తులకు చెక్ పెట్టడంలో వాస్తు నియమాలు ఉపయోగపడతాయి.

స్పటికాన్ని ఇంటి మధ్యలో ఉంచడం వల్ల నెగిటివిటీ దూరమయ్యే అవకాశం ఉంటుంది. వంటగదికి దగ్గర్లో బాత్ రూమ్ ఉండకూడదు. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. బరువైన వస్తువులను ఇంటి మధ్యలో ఉంచకూడదు. అలోవెరా, అరేకా ప్లాంట్, మనీ ప్లాంట్ మొక్కలను పెంచుకోవడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి.