నరదిష్టి తగిలితే కనిపించే సంకేతాలు ఇవే.. అలా చేస్తే మాత్రమే దిష్టి పూర్తిగా పోతుందా?

మనలో చాలామంది అన్నీ ఉన్నా ఏదో తెలీని అసంతృప్తితో బాధ పడుతూ ఉంటారు. కొన్నిసార్లు మన జీవితంలో జరుగుతున్న మార్పులకు నరదిష్టి కారణమయ్యే అవకాశం ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా నరదిష్టి వల్ల కలిగే నష్టాలు మాత్రం అన్నీఇన్నీ కావు. దిష్టి తగిలిన వ్యక్తికి చేసే పనుల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఆర్థిక సమస్యలు వేధించడం, పని చేయడానికి అవసరమైన శక్తి లేకపోవడం, ఎక్కువగా ఆలోచించడం, అతిగా కోపం వచ్చేయడం, చేసిన పనిపై సరిగ్గా దృష్టి పెట్టకపోవడం, నిద్ర రాకపోవడం, ప్రశాంతత లేకపోవడం నరదిష్టికి సంకేతాలని చెప్పవచ్చు. ఇతరులకు చెప్పుకోలేని సమస్యలు వేధిస్తుంటే నరదిష్టి కారణమయ్యే అవకాశం ఉంటుంది.

నరదిష్టి వల్ల నాపరాళ్లు సైతం పగులుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. మన చెడు కోరుకునే వాళ్ల చూపు ప్రభావం వల్ల మనకు నష్టం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. మన జీవితంలో ఎన్నో ప్రతికూలతలకు నరదిష్టి కారణమయ్యే అవకాశం ఉంటుంది. నరదిష్టి మనపై ప్రభావం చూపిస్తోందని అనిపిస్తే ఎండు మిరపకాయలు, నిమ్మకాయల‌ను ఒక దారంలో కట్టి ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర వేలాడదీస్తే మంచిది.

తెల్లని గుడ్డలో సముద్రం నీటిని వడగట్టి ఆ నీటిని గో మూత్రంలో కలిపి అమవాస్య, పౌర్ణమి రోజులలో ఇంట్లోని ప్రతి మూల చల్లితే అనుకూల ఫలితాలు వస్తాయి. ఇంట్లో అక్వేరియంను ఉంచడం వల్ల నరదిష్టి తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర దిష్టిబొమ్మ వేలాడదీయడం ద్వారా అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.