కిడ్నీ వ్యాధులతో కృంగిపోతున్నారా? అయితే అద్భుత ఆయుర్వేద చిట్కా మీ కోసమే?

ఈ సృష్టిలో మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన అన్ని ఔషధ మూలికలను, పోషక విలువలను మన పరిసరాలలో మెండుగా పెరిగి మొక్కల్లో ఉంచి ఈ ప్రకృతి మనకు ప్రసాదిస్తోంది. వీటిని గ్రహించే శక్తి మనం కోల్పోయి తీవ్ర అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. అయితే మన పూర్వపు పెద్దలు మొక్కల్లోని ఔషధ గుణాలను గ్రహించి ఆయుర్వేద పద్ధతుల్లో అన్ని వ్యాధులకు పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. ఈరోజు కిడ్నీ వ్యాధులకు చక్కటి పరిష్కార మార్గాన్ని చూపేఅటిక మామిడి తీగ మొక్క గురించి తెలుసుకుందాం.ఈ మొక్కని పురాతన సంస్కృత గ్రంథాల్లో పునర్వవగా పిలవడం జరిగింది.
మొక్క శాస్త్రీయ నామం బొహేవియా,ఈ మొక్కని కొన్ని ప్రాంతాల్లో అంటుడు కాయ మొక్క అని కూడా పిలుస్తారు.

పురాతన భారతీయ ఆయుర్వేద వైద్యంలో అటీక మామిడి తీగ మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కలోని వేర్లు ,ఆకులు, కాండం ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉంది. పల్లె ప్రజలకు సుపరిచితమైన ఈ మొక్కలో మన అంతర శరీరంలో వ్యాధి కారక కణాలను నశింపజేసి అవయవాల పనితీరును మెరుగుపరచడం తో పాటు ప్రతి అవయవాన్ని రక్షించే ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి.అటిక మామిడి తీగ మొక్కను ఆకుకూరగా ఫ్రై చేసుకొని తినవచ్చు లేదా కషాయంగా చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈ మొక్కలోని ఔషధ గుణాలు కిడ్నీ వ్యాధులతో బాధపడే వారికి మంచి పరిష్కారం చూపిస్తాయి.అటిక మామిడి తీగ కషాయాన్ని ప్రతిరోజు పరగడపున 50 మి.లీ సేవిస్తే కిడ్నీ ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు ఏర్పడినా, డయాలసిస్ దశకు చేరుకున్న వారు సైతం కోలుకోవడం జరుగుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.

అటీక మామిడి కషాయాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం అధిక మామిడి మొక్కను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. మొక్కలోని ఆకులు, పువ్వులు, వేర్లతో సహా ముక్కలుగా తరిగి ఐదు లేదా పది నిమిషాలు 250 మి.లీ. నీటిలో మరిగించాలి. బాగా మరిగిన తర్వాత వడగట్టుకుని రసాన్ని మాత్రమే తీసుకొని ప్రతి రోజు ఉదయం పరగడపున 50 మి.లీ కషాయాన్ని సేవిస్తే కిడ్నీ సమస్యలన్నీ తొలగిపోవడమే కాకుండా సీజనల్గా వచ్చే అన్ని రకాల వ్యాధులను తట్టుకునే ఇమ్యూనిటీ సిస్టం మనలో బలపడుతుంది.