కిడ్నీ వ్యాధులతో కృంగిపోతున్నారా… ఈ ఆయుర్వేద చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టండి!

మన ఇంటి చుట్టూ పరిసరాలలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు మెండుగా పెరిగి ఎన్నో రకాల ఔషధ గుణాలను ఈ మొక్కల్లో ఉంచి ఈ ప్రకృతి మనకు ప్రసాదిస్తోంది. వీటిని గ్రహించే శక్తి మనం కోల్పోయి తీవ్ర అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. అయితే మన పూర్వపు పెద్దలు మొక్కల్లోని ఔషధ గుణాలను గ్రహించి ఆయుర్వేద పద్ధతుల్లో అన్ని వ్యాధులకు పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. ఈరోజు కిడ్నీ వ్యాధులకు చక్కటి పరిష్కార మార్గాన్ని చూపేఅటిక మామిడి తీగ మొక్క గురించి తెలుసుకుందాం.

పురాతన భారతీయ ఆయుర్వేద వైద్యంలో అటీక మామిడి తీగ మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కలోని వేర్లు ,ఆకులు, కాండం ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉంది. పల్లె ప్రజలకు సుపరిచితమైన ఈ మొక్కలో మన అంతర శరీరంలో వ్యాధి కారక కణాలను నశింపజేసి అవయవాల పనితీరును మెరుగుపరచడంతో పాటు ప్రతి అవయవాన్ని రక్షించే ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి.అటిక మామిడి తీగ మొక్కను ఆకుకూరగా ఫ్రై చేసుకొని తినవచ్చు లేదా కషాయంగా చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది.

ముఖ్యంగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి అటిక మామిడి రసం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి ప్రతిరోజు ఉదయం పరగడుపున ఈ కషాయాన్ని సేవించడం వల్ల కిడ్నీ వ్యాధి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.కిడ్నీలో రాళ్లు ఏర్పడిన చివరికి డయాలసిస్ చేయించుకుంటున్న వారు కూడా ఈ అటిక మామిడి రసాన్ని ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగటం వల్ల ఈ వ్యాధి నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు. అటికి మామిడి వేర్లు ఆకులను ముక్కలుగా కత్తిరించి 250 ఎమ్ ఎల్ నీటిని 50 ఎం ఎల్ వరకు వచ్చేవరకు మరిగించి గోరువెచ్చగా తీసుకోవాలి ఇలా చేయడంతో కిడ్నీ సమస్యలు తొలగిపోతాయి.