మనలో చాలామంది ఓట్స్ ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. బరువు తగ్గాలని భావించే వాళ్లకు ఓట్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ రూపంలో ఓట్స్ తినడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు. ఓట్స్ ను షుగర్, చాక్లెట్స్ తో కలిపి తీసుకోవడం వల్ల తీవ్రస్థాయిలో నష్టపోవాల్సి ఉంటుంది. పండ్లు, కూరగాయలతో కలిసి ఓట్స్ ను తీసుకోవడం వల్ల ఎంతో లాభం చేకూరుతుంది.
ఓట్స్ ను మరీ ఎక్కువగా తీసుకోవడం ద్వారా బరువు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇతర స్వీట్స్ తో కలిపి ఓట్స్ ను తీసుకోవడం ద్వారా శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. వారానికి రెండు రోజుల కంటే ఎక్కువగా ఓట్స్ తినడం ఏ మాత్రం మంచిది కాదు. ఓట్స్ లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఓట్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల అసిడిటీ, ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గ్యాస్ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు ఓట్స్ కు దూరంగా ఉంటే మంచిది. ఓట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చురుకుదనాన్ని కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. కొంతమందికి ఓట్స్ తినడం వల్ల అలర్జీ తరహా సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఓట్స్ లో ఉండే పాస్పరస్ వల్ల శరీరానికి నష్టమే తప్ప లాభం ఉండదని చెప్పవచ్చు.
ఓట్స్ లో ఫాస్పరస్ వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓట్స్ తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఓట్స్ కు దూరంగా ఉంటే మంచిది. ఓట్స్ తినేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.