పాపతో హీరోగాన్కి చెడిందట కదా.!

ఓ పెద్ద హిట్టు కొట్టాడో యంగ్ హీరో. ఆ సినిమాతో పాపం ఆ హీరోయిన్‌కి రావాల్సినంత మైలేజ్ అయితే రాలేదు. తెలివిగా, సక్సెస్ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకున్న ఆ యంగ్ హీరో, తన తర్వాతి సినిమాలో ఆమెకు ఛాన్సిస్తానన్నాడటగానీ, మాట నిలబెట్టుకోలేకపోయాడట.

సినిమా హిట్టయినా, తనకు మైలేజ్ పెరగడానికి కారణమేంటో ఆ ‘పాప’కి ఇప్పుడిప్పుడే తెలుస్తోందిట. మీడియాని మేనేజ్ చేసిన హీరో, హీరోయిన్ పేరు పెద్దగా హైలైట్ కాకుండా జాగ్రత్త పడ్డాడట.

విషయం తెలిసి, ఇప్పుడు తీరిగ్గా ఏడుస్తోందిట ఆ పాప. ఆ హిట్టు సినిమాకి సీక్వెల్ కూడా రాబోతోంది. కానీ, ఆ పాప గురించి ఎక్కడా వార్త లేదాయె.! ఆ పాపతో హీరోగాన్కి చెడిందట కదా.. అని చర్చించుకుంటున్నారు సినీ పరిశ్రమలో.

ఇందులో చెడేదేముంది.? మనోడి నైజమే అంత.. అనుకుంటున్నారు. ఇంతకీ ఎవరా హీరో.? ఏమా కథ.?