Mahesh Vitta: తెలుగు ప్రేక్షకులకు నటుడు మహేష్ విట్టా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట ఫన్ బకెట్ కామెడీ సిరీస్ తో భారీగా గుర్తింపు తెచ్చుకున్నారు మహేష్. అలా మొదట యూట్యూబ్ ద్వారా భారీగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ కేవలం అడపాదడపా సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు మహేష్ విట్టా సినిమా ఇండస్ట్రీలో తనను చాలామంది మోసం చేశారని చెప్పకొచ్చారు.
ఈ సందర్బంగా మహేష్ మాట్లాడుతూ.. నాకు కనీసం సొంత ఇల్లు కూడా లేదు. ఫేమస్ అయితే చాలదు. డబ్బులు కావాలి. హైదరాబాదులో సొంత ఇల్లు ఉండాలంటే కనీసం కోటి రూపాయలు ఉండాలి. నేను చాలా సినిమాలు చేసినా చాలా మంది డబ్బులు ఎగ్గొట్టారు. చాలా మంది మోసం చేసే వాళ్ళు. చాలా ప్రొడక్షన్ హౌస్ లు డబ్బులు ఇవ్వలేదు. టీవీ ఫీల్డ్ లో లేట్ గా అయినా సరే ఇస్తారు. కానీ సినిమాల్లో డబ్బులు రావు. కొంతమంది పని అయ్యాక డబ్బులు ఇవ్వం అని మొహం మీదే చెప్తారు. మనం గట్టిగా అడిగితే మన గురించి వాళ్ళు పరిశ్రమలో ఎక్కడ నెగిటివ్ గా చెప్తారేమో అని మనం సైలెంట్ గా ఉంటాము అని తెలిపాడు.
అలా ఒకర్ని నమ్మి ఒక ప్రాజెక్టు అప్పచెప్తే హార్డ్ డిస్కులు తీసుకెళ్లి డబ్బులు ఇస్తేనే ఇస్తాను అన్నాడు. వాడికి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. వాడికేమన్న అయితే వాళ్ళ పేరెంట్స్ నన్ను అడుగుతారు. అందుకే నేను అది వదిలేసి మళ్ళీ డబ్బులు పెట్టి ఆ ప్రాజెక్టు ఇంకోసారి తీసాను. అలా కూడా నష్టపోయాను అని తెలిపారు మహేష్. బిగ్ బాస్ నుంచి వచ్చింది, బయట సంపాదించింది మొత్తం ఆ సినిమాలోనే పెట్టాను. ఆ సినిమా షూటింగ్ అయిపోయింది. సినిమా ఇండస్ట్రీలో నాతో వచ్చి కష్టపడిన వాళ్లంతా కలిసి దానికి పనిచేశాము. అది కిడ్నాప్ కామెడీ కథతో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. షూటింగ్ అంతా మా కడప జిల్లాలోనే చేశాము అని తెలిపారు మహేష్ విట్టా. ఈ సందర్భంగా హీరో మహేష్ విట్టా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Mahesh Vitta: సొంత ఇల్లు లేదు.. చాలామంది డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు: నటుడు మహేష్ విట్టా
