జీవితంలో ఎదురైన ఓ బ్రేకప్.. కొందరిని చీకట్లోకి తోస్తుంది. కానీ అపూర్వ ముఖిజా అనే యువతి జీవతి జీవితాన్నే మార్చేసింది. ఆ బాధ తన జీవితాన్ని మార్చుకునే మార్గం గా మార్చింది. చిన్న వీడియోలతో మొదలైన ఈ యువతి జర్నీ.. ఇప్పుడు కోట్లలో డీల్‌లు తెస్తున్న డిజిటల్ స్టోరీగా మారింది. అందుకే ఆమెకు ‘ది రెబెల్ కిడ్’ అనే పేరు వచ్చింది.
సాధారణ అమ్మాయి నుంచి ఫోర్బ్స్ లిస్ట్ వరకు: 2001 జూలై 28న ఢిల్లీలో పుట్టిన అపూర్వ… మిడ్‌ల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయి. తల్లి టీచర్, తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. DPS పానిపట్ లో స్కూలింగ్. తర్వాత జైపూర్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్. చిన్నప్పుడు నటన అంటే ఇష్టం. కానీ చదువులు, జాబ్ అంటూ ఓ నార్మల్ లైఫ్. ఇంజినీరింగ్ చదివి, కార్పొరేట్ జాబ్ సంపాదించింది. కానీ ఆ డెస్క్ జాబ్ కంటే తనకు ఇష్టమైనదే చేయాలని అనుకుంది.
అయితే వ్యక్తిగత జీవితంలో ఎదురైన బ్రేకప్, కెరీర్‌లో అయోమయం ఆమెకు దారి చూపించాయి. 2019లో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిన్న కామెడీ వీడియోలు చేసింది. వాటి బోల్డ్ హ్యూమర్, యూత్ సమస్యలపై స్ట్రాంగ్ పాయింట్స్.. అన్నీ Gen Zకి దగ్గరయ్యాయి. ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ, అప్పటి సాధారణ అపూర్వ… ఇప్పుడు ఫోర్బ్స్ లిస్టులో చోటు దక్కించుకున్న ‘డిజిటల్ స్టార్’ గా మారింది.
ఒక్కో రీల్‌కు లక్షలు:
అపూర్వ ముఖిజా రీల్ చార్జ్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ రీల్‌కి ఆమె రూ. 20-25 లక్షలు తీసుకుంటుంది. ఒక్కో ఇన్‌స్టా స్టోరీకే రూ. 2 లక్షలు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, మెటా, నైక్, గూగుల్, వన్‌ప్లస్ లాంటి 150కిపైగా బ్రాండ్‌లతో ఆమెతో పనిచేస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే 40 లక్షలకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్‌లో 10 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. కంటెంట్ నుంచి వచ్చే ఆదాయం… స్పాన్సర్ బ్రాండ్లతో కూడిన భారీ డీల్స్… ఇవన్నీ ఆమెను కోట్లు కొల్లగొడుతున్న రీల్ క్వీన్‌గా మార్చాయి.
తన వ్యక్తిగత సమస్యల గురించి, బ్రేకప్ ఎఫెక్ట్ గురించి, మెంటల్ హెల్త్ గురించి ఆమె ఓపెన్‌గా మాట్లాడేది. ఫాలోవర్లకు సపోర్ట్ ఇవ్వడానికి mental health డైలాగ్‌లను కూడా షేర్ చేస్తుంది. టేలర్ స్విఫ్ట్‌కి పెద్ద ఫ్యాన్. ట్రావెల్, అడ్వెంచర్స్ ఇష్టం.
అపూర్వ జీవితంలో వివాదాలు కూడా ఉన్నాయి. 2025లో సమయ్ రైనా షోలో చేసిన కామెంట్స్ వివాదం అయ్యింది. ముంబై, అస్సాంలో FIRలు నమోదయ్యాయి. ఆమె తల్లికి బెదిరింపులు. తర్వాత unapologeticగా సారీ చెప్పింది. ఉర్ఫీ జావేద్‌తో గొడవ, యూనివర్శిటీలో విద్యార్థులతో వాగ్వాదం… ఇవన్నీ ఆమెను ఎక్కువగా హైలైట్ చేసేశాయి. కానీ ఇవన్నీ ఎదుర్కొంటూ unapologetic rebelగా నిలిచింది.
సోషల్ మీడియాలో కామెడీ అంటే సరళంగా ఉంటుంది. కానీ అపూర్వ కామెడీకి రియల్ లైఫ్ టచ్. అదే USP. రిలేషన్ షిప్స్, సొసైటీ, యువత డైలీ ఫీలింగ్స్… అన్నీ ఓ రీల్ ద్వారా చూపిస్తే ఎక్కడో connect అవుతారు. అందుకే Gen Zకి ఆమె అంటే ఇష్టం. సాధారణ జీవితంలో ఎదురైన కష్టాలనే తన డైలాగ్స్, స్క్రిప్ట్స్‌లో మార్చి పెట్టి… బ్రాండ్‌గా మార్చిన అపూర్వ ముఖిజా… ఇప్పుడు నిజంగా ‘ది రెబెల్ కిడ్’.