అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప ది రైజ్’ వచ్చి చాలా కాలమే అవుతోంది. ఇంకెప్పుడు ‘పుష్ప 2 ది రూల్’ అని అల్లు అర్జున్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే, పరిస్థితులు ఏమంత అనుకూలంగా కనిపించడంలేదట.
ఓ వైపు షూటింగ్ జరుగుతున్నా, జరగాల్సిన షూట్ పార్ట్ చాలా వుందని తెలుస్తోంది. ఎందుకీ డిలే.? అన్నదానిపై స్పష్టత లేదు. కొన్ని సీన్స్ రీషూట్ కారణంగా షెడ్యూల్స్ అనుకున్న విధంగా జరగడంలేదంటూ ‘పుష్ప 2 ది రూల్’ గురించిన గాసిప్స్ హల్చల్ చేస్తున్నాయి.
తాజాగా వినిపిస్తున్న ఊహాగానాల సారాంశమేంటంటే, దర్శకుడు సుకుమార్ హీరోయిన్ రష్మిక మండన్న నుంచి 40 నుంచి రోజుల డేట్స్ అడుగుతున్నాడట. అంటే, చేయాల్సిన షూట్ పార్ట్ చాలా చాలా ఎక్కువే వున్నట్టు కదా.?
ఇదంతా నిజమేనా.? ‘పుష్ప 2 ది రూల్’ మీద జరుగుతున్న దుష్ప్రచారమా.? అన్న అనుమానాలూ అల్లు అర్జున్ అభిమానుల్లో కలుగుతున్నాయి. పాన్ ఇండియా సినిమా కదా, ఆ మాత్రం జాగ్రత్తలు.. దాంతోపాటే ఆలస్యాలూ వుంటాయ్ మరి.!
అభిమానులే అర్థం చేసుకోవాలి.! ఇంతకీ, ప్రచారంలో వున్న గాసిప్స్ విషయమై ‘పుష్ప 2 ది రూల్’ టీమ్ ఏమన్నా స్పష్టతనిస్తుందా.? వేచి చూడాలిక.