Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సినిమా ఇండస్ట్రీ పట్ల తీసుకునే నిర్ణయం పై హర్షం వ్యక్తం అయింది. సీఎం రేవంత్ రెడ్డి సినిమాల విషయంలో తీసుకున్న నిర్ణయం సరైనదేనని అందరూ భావించారు అయితే ఈయన మాట ఇచ్చిన నేల వ్యవధిలోనే ఇచ్చిన మాటను తుంగలో తొక్కేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదలైన సందర్భంలో బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వెళ్లడంతో తొక్కిసలాట జరిగి ఒక మహిళ అభిమాని మరణించింది.
ఇలా బెనిఫిట్ షో కారణంగా అభిమానులకు ఇబ్బంది తలెత్తుతుందన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా అసెంబ్లీలో ఈ విషయం గురించి మాట్లాడుతూ చట్టం అందరికీ సమానమేనని చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ మాట్లాడటమే కాకుండా ఇకపై తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు సినిమాలకు ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవు అలాగే టికెట్ల రేట్లు కూడా పెంచేది లేదు అంటూ ఈయన అసెంబ్లీలో చెప్పారు.
ఇక అల్లు అర్జున్ అరెస్ట్ విషయం పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాలలో దుమారం రేపింది. ఇక రేవంత్ రెడ్డి సినిమాల గురించి ఇలా మాట్లాడిన ఒక నెల వ్యవధిలోనే ఈయన తన మాట తప్పరు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కూడా రేవంత్ రెడ్డి కట్టుబడి లేరు. త్వరలోనే రాంచరణ్ నటించిన సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈయన సినిమా టికెట్ల రేట్లు అలాగే బెనిఫిట్ షోలకు కూడా అనుమతి తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో సినిమాల గురించి చేసిన వాగ్దానాలను వెనక్కి తీసుకున్నారని ఇచ్చిన మాట పై నిలబడలేరు అంటూ విమర్శలు కురిపించారు. రామ్ చరణ్ విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోలేదా రామ్ చరణ్ కు ఒక న్యాయం అల్లు అర్జున్ కి మరొక న్యాయమా దీన్నిబట్టి చూస్తుంటే.. రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ రేవంత్ తీరుపై తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు.