Pushpa 2: పుష్ప 2 మూవీ రిలీజ్ వాయిదా.. వారికి బిగ్ రిలీఫ్ ఇస్తూ వెనక్కి తగ్గిన అల్లు అర్జున్!

Pushpa 2: టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం పుష్ప 2. ఇప్పటికే ఈ సినిమా విడుదల అయ్యి నెలరోజులు పూర్తి అయిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా 1832 కోట్లను సాధించి వసూళ్ల సునామీని సృష్టించింది. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 2 సినిమా లాంటి రికార్డులను సైతం బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. నార్త్ లో ఇంకా చాలా థియేటర్స్ లో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతూ దూసుకుపోతోంది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేసారు. అయితే ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా అమీర్ ఖాన్ దంగల్ నిలిచింది.

ఆ తర్వాత మొన్నటి దాకా బాహుబలి 2 ఉండగా ఆ సినిమాను వెనక్కి నెట్టు మరి ఇప్పుడు పుష్ప 2 రెండో ప్లేస్ లో నిలిచింది. దీంతో దంగల్ రికార్డ్ కూడా బద్దలు కొట్టాలని పుష్ప 2 సినిమాకు 20 నిమిషాల ఫుటేజ్ జతచేసి జనవరి 11న మళ్ళీ రీ రిలీజ్ చేస్తామని ప్రకటించారు మూవీ. దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. దంగల్ రికార్డులు కొడతామని ఫిక్స్ అయ్యారు. కానీ పలువురు మాత్రం సంక్రాంతి సినిమాలు వస్తుంటే మళ్ళీ పుష్ప 2 రిలీజ్ అవసరమా అని విమర్శలు కూడా చేసారు. అలాగే మూడు గంటల సినిమా నిడివి తగ్గించాల్సింది పోయి మళ్ళీ ఇంకో 20 నిముషాలు జత చేయడం అవసరమా అని కూడా విమర్శలు వచ్చాయి.

ఇకపోతే ఇప్పటికే సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. రెండు రోజుల గ్యాప్ తో ఈ మూడు సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి. ఇప్పటికే అన్ని థియేటర్స్ లో ఈ మూడు సినిమాలు రిలీజ్ చేయడానికి రెడీ అయి బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. సంక్రాంతి సినిమాలకు సడెన్ గా పుష్ప 2 షాక్ ఇచ్చిందని టాలీవుడ్ లో టాక్ నడిచింది. అయితే పుష్ప 2 మూవీ యూనిట్ వెనక్కు తగ్గి సంక్రాంతికి సీన్స్ జతచేసి రీ రిలీజ్ చెయ్యట్లేదు అని ప్రకటించింది. పలు సాంకేతిక కారణాల వల్ల పుష్ప 2 రీ లోడెడ్ వర్షన్ వాయిదా వేస్తున్నాము. జనవరి 11 రిలీజ్ చేయాలనుకున్నాము కానీ జనవరి 17 రిలీజ్ చేస్తాము అని ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అయితే సంక్రాంతి సినిమాల కోసమే పుష్ప 2 నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా పుష్ప 2 రీ లోడెడ్ వర్షన్ సంక్రాంతి తర్వాత రిలీజ్ కానుంది. అప్పుడు అయినా 2000 కోట్లతో దంగల్ రికార్డ్ బద్దలు కొట్టాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.