Niharika: ఇన్నాళ్లకు సంధ్యా థియేటర్ ఘటనపై స్పందించిన నిహారిక…. మనసు ముక్కలైందంటూ?

Niharika: మెగా డాటర్ నిహారిక తాజాగా సంధ్య థియేటర్ ఘటన గురించి స్పందించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని తెలిపారు. ఈ ఘటనలో రేవతి అనే అభిమాని మరణించిందనే విషయం తెలియగానే మనసు ముక్కలైపోయిందని తెలిపారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘మద్రాస్‌ కారన్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సంధ్య థియేటర్‌ ఘటనపై మాట్లాడారు.

ఇలాంటి ఘటనలు జరుగుతాయని ఎవరూ కూడా ఊహించి ఉండరని బన్నీ కూడా ఈ విషయంలో షాక్ కి గురి అయ్యారని తెలిపారు. మీ అందరి ప్రేమాభిమానాలతో ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్ ఆ బాధ నుంచి బయటపడుతున్నారు అంటూ నీహారిక తెలిపారు. ఇక ఈ ప్రమోషన్లలో భాగంగా ఈమె తన ఇంట్లో ఉన్నటువంటి హీరోల గురించి కూడా మాట్లాడారు.

అల్లు అర్జున్ గురించి నిహారిక మాట్లాడుతూ..అల్లు అర్జున్‌ నుంచి తాను చాలా నేర్చుకున్నానని చెప్పింది. లుక్‌ విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని, ప్రతి సినిమాకు తన స్టైల్‌ని మార్చుకుంటాడని.. ఆ విషయంలో బన్నీ నుంచి స్ఫూర్తి పొందుతానని చెప్పింది. ఇక ఏదైనా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనేటప్పుడు అక్కడ ఎలా మాట్లాడాలి ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా నేను చరణ్ అన్న నుంచి నేర్చుకున్నాననీ నిహారిక తెలిపారు.

ఇక తాను ఏదైనా సినిమా కథల ఎంపిక విషయంలో కనుక తడబాటకు గురి అయితే తప్పనిసరిగా తన అన్నయ్య వరుణ్ సలహాలు సూచనలు తీసుకుంటాను అంటూ నీహారిక ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగి సరిగా నెల రోజులు పూర్తి అయిపోయింది అయితే ఇన్ని రోజులపాటు మౌనంగా ఉన్నటువంటి నిహారిక ఇన్ని రోజుల తర్వాత ఈ ఘటన గురించి మాట్లాడుతూ బాధ కలిగించిందని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలపై పలువురు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. తన సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో బన్నీ ఫాన్స్ ని అట్రాక్ట్ చేయడం కోసమే ఇలా మాట్లాడుతున్నారు అంటూ బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.