అంతా వుత్తదేనా.? రామ్ చరణ్‌కి అంత సీను లేదా.?

నిఖిల్‌తో రామ్ చరణ్ ఓ సినిమా తీయబోతున్నాడట. అది కూడా రామ్ చరణ్ స్టార్ట్ చేసిన కొత్త బ్యానర్ వి – మెగా పిక్చర్స్ ద్వారా వుండబోతోందట.. అంటూ ఈ మధ్య ప్రచారం జరిగింది. ‘వీర సవార్కర్’ అంటూ ఈ సినిమాకి టైటిల్ కూడా రిలీజ్ చేశారు.

సినిమా నిజమే, టైటిల్ నిజమే. కానీ, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ రామ్ చరణ్ అన్నదాంట్లో నిజం లేదంటున్నారు. ఈ సినిమాకి కేవలం సమర్పకుడు మాత్రమేనట రామ్ చరణ్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోందట. యూవీ క్రియేషన్స్ నుంచి విక్రమ్ కొంత భాగస్వామిగా వ్యవహరించబోతున్నాడట.

ఆ క్రమంలోనే ఓ స్టార్ పేరు యాడ్ అయితే, సినిమాకి ఇంకాస్త వెయిట్ వస్తుందని రామ్ చరణ్ పేరు యాడ్ చేసుకున్నారట అంతే. అంతకు మించి రామ్ చరణ్‌కి నిర్మాణంలో ఏమాత్రం భాగస్వామ్యం లేదని ఇన్ సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.

‘ఆచార్య’ విషయంలోనూ ఇంతే. కేవలం రామ్ చరణ్ బ్యానర్ పేరు మాత్రమే వాడుకున్నారు తప్ప, మిగిలిన కథంతా కొరటాల శివదే. సినిమా ఫ్లాప్ అయ్యేసరికి రామ్ చరణ్ పేరు బయటికి లాగేశారంతే.