Mega Family: జనవరి 10 మెగా ఫ్యామిలీకి కలిసి రాదా.. మరీ ఇన్ని ప్లాపులు ఉన్నాయా?

Mega Family: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే ఎంతోమంది హీరోలు ఎన్నో సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల డేట్లు టైటిల్స్ అనేవి హీరోలకు సెంటిమెంట్లుగా కొనసాగుతూ ఉంటాయి. అయితే మెగా ఫ్యామిలీకి కూడా అలాంటి ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉందని తెలుస్తోంది గత కొంతకాలంగా మెగా హీరోలు నటించిన సినిమాలు జనవరి 10వ తేదీ విడుదల అయ్యి డిజాస్టర్లుగా నిలిచాయి.

అయితే తాజాగా రామ్ చరణ్ నటించిన సినిమా కూడా జనవరి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా ఫస్ట్ డే మిక్స్డ్ సొంతం చేసుకుని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. మరి కొన్ని చోట్ల మాత్రం ఈ సినిమా డిజాస్టర్ టాక్ అంటూ కొందరు సోషల్ మీడియాలో ఈ సినిమాకి వారి రివ్యూలను ఇస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో జనవరిలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన మెగా హీరోల సినిమాలను గురించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

చిరంజీవి హీరోగా నటించిన మృగరాజ సినిమా జనవరి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అప్పట్లో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఏడేళ్ల క్రిందట జనవరి 10 అజ్ఞాతవాసి సినిమా రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక రామ్ చరణ్ కియారా హీరో హీరోయిన్లుగా నటించిన వినయ విధేయ రామ సినిమా కూడా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 2019 జనవరి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పట్ల ఎన్నో అంచనాలు ఉండేవి కానీ ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా వరుస ఫ్లాప్స్ వెంటాడినప్పటికీ మెగా హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా కూడా ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమాకి కొన్ని చోట్ల మిక్స్డ్ టాక్ మరికొన్ని చోట్ల డిజాస్టర్ టాక్ రావడంతో గత సెంటిమెంట్ ఈ సినిమాలో కూడా వర్క్ అవుట్ అయింది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.