Prabhas: ప్రభాస్ కి పెళ్లి ఫిక్స్ అయ్యిందా… అమ్మాయి వివరాలు బయటపెట్టిన రామ్ చరణ్?

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో నటుడు ప్రభాస్ ఒకరు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ప్రభాస్ ఇప్పటివరకు మాత్రం పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఎక్కడికి వెళ్లినా ప్రభాస్ పెళ్లి ప్రస్తావన అనేది వస్తూనే ఉంది.

ఇకపోతే ఇటీవల రామ్ చరణ్ బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ పెళ్లి గురించి మరోసారి ప్రస్తావన వచ్చిందని తెలుస్తది అంతేకాకుండా ఈ షోలో రామ్ చరణ్ ప్రభాస్ కి ఫోన్ చేసి మరీ మాట్లాడారు ఈ క్రమంలోనే రామ్ చరణ్ ప్రభాస్ పెళ్లి గురించి అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పేశారు.

ప్రభాస్ పెళ్లి గురించి కూడా గతంలో బాలయ్య ఏకంగా ప్రభాస్ ని అడగగా ప్రభాస్ మాత్రం నా పెళ్లి సల్మాన్ ఖాన్ చేసుకున్న తర్వాతే అంటూ సరదాగా మాట్లాడారు. అయితే తాజాగా రాంచరణ్ మాత్రం ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ ప్రభాస్ కి పెళ్లి ఫిక్స్ అయిందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెలిపారు. ఇక ఈయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అమ్మాయి అని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గణపవరంకి చెందిన అమ్మాయితో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయినట్లు చరణ్ తెలిపారు.

అయితే ప్రభాస్ పెళ్లి గురించి రాంచరణ్ ఇంకా ఎలాంటి విషయాలు తెలిపారు అనే విషయాలు తెలియాలి అంటే ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ ఎపిసోడ్ జనవరి 14వ తేదీ ప్రసారం కానుంది. ప్రభాస్ తో పాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోలు అందరూ కూడా పెళ్లిళ్లు చేసుకొని భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నారు కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటివరకు బ్యాచిలర్ గా ఉన్న నేపథ్యంలో ఈయన పెళ్లి గురించి తరచూ ఏదో ఒక వార్త వినపడుతూనే ఉంది.