కాపులందరినీ ఏకతాటిపైకి తెచ్చి చంద్రబాబు పల్లకి మోయించాలని ఒకవైపు పవన్ తపిస్తుంటే… మరోపక్క చంద్రబాబేమో కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక యువరైతుని… “దొంగ” అని సంభోదించారు.. ఆగ్రహం వ్యక్తం చేశారు. తన చేతకానితనాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఆగ్రహం ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి చూపించారు. ప్రస్తుతం ఈ ఇష్యూ వైరల్ అవుతుంది.. మాజీ జనసైనికులు తమ తమ సోషల్ మీడియా గ్రూపుల్లో దీన్ని వైరల్ చేస్తున్నారు.
తాజాగా తణుకులో పోరుబాట నిర్వహించారు చంద్రబాబు. అందులో భాగంగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులతో ముఖాముఖీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక యువకుడు లాజికల్ గా ప్రశ్నించడంతో… చంద్రబాబుకు బీపీ అమాంతం పెరిగిపోయింది. క్షణం ఆలోచించకుండా ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు నువ్వు అంటూ ఏక సంభోదంతో మాట్లాడారు. ఫలితంగా ఈ వ్యవహారాన్ని పార్టీలకతీతంగా దుయ్యబడుతున్నారు నెటిజన్లు.
అవును… ముఖాముఖీ సమావేశంలో యువ రైతు ఒకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రభుత్వం మెడలు వంచి నష్టపరిహారం అందిస్తానన్న చంద్రబాబుపై ప్రశ్నలవర్షం కురిపించాడు. “అసెంబ్లీకే వెళ్లని మీరు మా సమస్యపై ఎలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు” అని అడిగాడు. దీంతో చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులు అంతా ఒక్కసారిగా ఆ యువ రైతుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సరే ఆ యువకుడు “తగ్గేదేలే” అన్నట్లుగా రివర్స్ అయ్యాడు. బాబు & కోలకు షాకిచ్చాడు.
“నేను పోరంబోకు యువకుడ్ని కాదు.. బాధ్యత గల రైతుని.. కాపు కులం వాడిని”.. అని బాబుకి షాకిచ్చాడు. దీంతో మరింత రెచ్చిపోయిన బాబు… “ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్..” అంటూ ఆ యువకుడిపై ఫైరయ్యారు. “పక్కకు తీసేయ్యండి..” అంటూ పార్టీ నేతలకు సూచించారు. అంతటితో ఆగని చంద్రబాబు… పక్కనే ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యేతో… “వీడొక దొంగ.. వాడొక దొంగ” అంటూ తిట్టడం మొదలుపెట్టారు. దీంతో కీబోర్డులకు పని చెబుతున్నారు నెటిజన్లు.
ఆ యువకుడు అడిగినదాంట్లో తప్పేముందని… సమాధానం చెప్పలేకపోతే మూసుకుని కూర్చోవాలి కానీ ఇలా ఎదురు దాడిచేస్తే ఓటుతో కొడతారని హెచ్చరిస్తున్నారు. టీడీపీతో పొత్తులు, సీఎం పదవిపై పవన్ తాజాగా ప్రకటన చేసిన నేపథ్యంలో.. కాపు సామాజికవర్గం ఆగ్రహంగా ఉందని వార్తలు వస్తున్న ఈ సమయంలో… ఓ కాపు యువకుడిని ఉద్దేశించి చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో… “జనసేన – టీడీపీ కూటమి” కి మద్దతు పలికితే ఫ్యూచర్ లో కాపుల పరిస్థితి ఇంతే అని హెచ్చరిస్తున్నారు నెటిజన్లు!