Allu Arjun: నన్ను క్షమించండి.. మొదటిసారి తలవంచిన పుష్ప రాజ్… ఏం జరిగిందంటే?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమా ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల పాట్నాలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఇలా ఊహించని విధంగా అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సినీ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. అనంతరం అల్లు అర్జున్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్నంత సేపు అభిమానులు పెద్ద ఎత్తున గోల చేస్తూ సందడి చేశారు. పాట్నాకు వెళ్లి ట్రైలర్ లాంచ్ చేసిన అభిమానులు మాత్రం భారీ సంఖ్యలో తరలి రావడంతో పుష్పరాజ్ క్రేజ్ ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ హిందీలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను మొదటిసారి బీహార్ వచ్చాను. నాకు పెద్దగా హిందీ రాదు ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి అంటూ మాట్లాడారు. సాధారణంగా పుష్ప ఎవరికి తలవంచరు కానీ మొదటిసారి మీ ముందు తల వంచుతున్నాడు అంటూ అభిమానులను ఉద్దేశించి బన్నీ కామెంట్ చేశారు.

అభిమానులు చూపిస్తున్న ప్రేమ.. అభిమానానికి మొదటిసారి తల వంచుతున్నాడు.మీరు చూపిస్తున్న ప్రేమ ఇంత గొప్ప సినిమా తీయడానికి మాకు ప్రేరణ. డిసెంబరు 5న పుష్ప2 రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని బన్నీ భరోసా ఇచ్చారు.పుష్ప అంటే ఫ్లవర్ అనుకొంటివా..? కాదు వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ చెప్పడంతో ఒక్కసారిగా ఆ ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది.

ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ ట్రైలర్ లో భారీ యాక్షన్ సన్ని వేషాలను చూపించారు. ఇక రష్మిక కూడా మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు కచ్చితంగా మీ ఫ్యామిలీ లతో కలిసి డిసెంబర్ 5వ తేదీ థియేటర్లో ఈ సినిమా చూడాలని ఆమె కూడా కోరారు.