Chandra Babu: పేరు కోసమే రెండు సార్లు ఓడిపోయాను.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

Chandra Babu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల హిందూస్థాన్ టైమ్స్ పత్రిక వందేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన నాయకత్వ సదస్సులో పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన రాజకీయ జీవితం గురించి పలు విషయాలను వెల్లడించారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే 2004, 2019వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో ఓడిపోయారు అయితే ఆ రెండు సార్లు ఎందుకు ఓడిపోయాను అనే విషయాల గురించి ఈ సందర్భంగా తెలియజేశారు.

తాను ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండగా 2004 2019వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో ఓడిపోయాను అయితే నేను నా పేరు కోసం ప్రయత్నించడం వల్లే ఆ రెండు ఎన్నికలలో ఓడిపోయానని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్యమంత్రిగా అందరూ నన్ను పొగుడుతూ ఉంటే నేను బాగా చేస్తున్నానేమో అని భావించి ప్రజలను వదిలి ముందుకు వెళ్లాను.

ఇలా ప్రజలను వదిలేయడం వల్లే నేను ఆ రెండు సార్లు ఓడిపోయానని చంద్రబాబు వెల్లడించారు. ప్రధాని మోదీ అలా చేయకుండా ఎప్పుడూ తనవెంట ప్రజలను తీసుకెళుతూ పనిచేస్తున్నారు. 2004, 2019ల్లో నేను అది విస్మరించాను. నేను కనుక అలాగే చేసి ఉంటే పరిస్థితులు నేడు ఇలా ఉండేది కాదని బాబు తెలియజేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలన విషయంలో చాలా స్పష్టతతో ఉన్నానని చంద్రబాబు నాయుడు తెలిపారు..

తాను తనతో పాటు ప్రజలను కూడా ముందుకు తీసుకెళుతున్నానని వెల్లడించారు.అభివృద్ధి, సంక్షేమం కొనసాగిస్తే ప్రజాక్షేత్రంలో ఉత్తమ పనులు చేయగలనని భావిస్తున్నానని వెల్లడించారు. 2029 వరకు దేశ ప్రణాళికలను నరేంద్ర మోడీ ఎంతో అద్భుతంగా రచించారు. దేశ ప్రయోజనాల కోసం ఆయన నాయకత్వంలో పనిచేస్తూ ముందుకెళతామని స్పష్టం చేశారు.