మన హిందూ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు దేవున్ని పూజించడం వల్ల
జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అంతే కాకుండా పూజా సమయంలో పలికే వేద మంత్రాలు అత్యంత ప్రభావవంతమైనవిగా పరిగణిస్తారు. ఇలా వేదమంత్రాలు పటిస్తూ దైవారాధన చేయటం వల్ల ఆ దైవం అనుగ్రహం లభిస్తుంది. దైవారాధన సమయంలో వివిధ మంత్రాలను పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలు, వేద మంత్రాల ప్రాముఖ్యత గురించి వేదాల్లో వివరించారు. అలాగే వేదమంత్రాలు పట్టించే సమయంలో వివిధ మాల కూడా ఉపయోగిస్తుంటారు.
అలాగే లక్ష్మీదేవిని పూజించే సమయంలో కూడా ఇలా వేదమంత్రాలనుపఠించే సమయంలో కూడా మాల ని ఉపయోగిస్తారు. లక్ష్మీదేవి పూజలో స్పటిక మాల అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. స్ఫటిక మాల ధరించి లక్ష్మీ దేవిని ఆరాధిస్తే అమ్మవారి అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నాయి. స్ఫటికాలతో చేసిన మాలను ఉపయోగించి పూజ చేయడం ద్వారా శుక్ర గ్రహా అనుగ్రహాన్ని పొందవచ్చు.స్ఫటిక మాలతో శుక్రుని మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
శుక్రవారం నాడు స్పటిక మాల ను ధరించి.. లక్ష్మీ దేవి మంత్రాన్ని పఠిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి కి పూజా చేస్తున్న సమయంలో ” ‘పంచవక్త్ర: స్వయం రుద్ర: కాలాగ్నిర్నామ నమతః ” అనే మంత్రాన్ని జపించాలి . ఇలా చేయటం వల్ల ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. అంతే కాదు ఈ మాలతో జపించడం వల్ల కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. పూజాగదిలో లక్ష్మీదేవికి స్ఫటికాల దండను సమర్పించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఇలా చేయటం వల్ల జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. అంతే కాకుండా లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడానికి రైన్‌స్టోన్ మాల జపించడం చాలా మంచిది.